Career Astrology: గ్రహాల అరుదైన కలయిక.. వారికి కెరీర్‌లో పురోగతి పక్కా..!

Sun-Ketu Yuti 2026: 2026 ఆగస్టు 17న ఏర్పడనున్న అరుదైన రవి–కేతువు యుతి మూడు రాశుల వారికి శుభ ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ గ్రహ యుతి ప్రభావంతో నిలిచిపోయిన పనులు పూర్తికావడం, ఉద్యోగ–వ్యాపారాల్లో పురోగతి, ఆర్థిక లాభాలకు అవకాశముంది. అలాగే సమాజంలో గౌరవం పెరగడం వంటి అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

Career Astrology: గ్రహాల అరుదైన కలయిక.. వారికి కెరీర్‌లో పురోగతి పక్కా..!
Sun Ketu Yuti
Image Credit source: AI

Updated on: Aug 06, 2026 | 4:36 PM

Telugu Astrology: 2026 ఆగస్టు 17న రవి తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే సమయంలో కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తుండటంతో రవి–కేతువు యుతి ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ అరుదైన గ్రహ యుతికి ప్రాధాన్యత ఉంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు దక్కే అవకాశముంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి సగంలో ఆగిపోయిన పెండింగ్ పనులు పూర్తికావడం, కొత్త ఉద్యోగ అవకాశాలు, గౌరవ మర్యాదలు పెరగడం వంటి ఫలితాలు దక్కే అవకాశముంది.

సింహ రాశి

సింహరాశి వారికి ఈ యుతి అత్యంత శుభప్రదంగా ఉండే అవకాశముంది. రవి స్వక్షేత్ర గోచారం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి కావచ్చు. కుటుంబం, సమాజంలో మీ గౌరవం పెరిగే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, కెరీర్‌లో పురోగతి సాధిస్తారు.

కన్య రాశి

కన్యరాశి వారికి ఆదాయ వనరులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో చేసిన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు కలిసివస్తాయి.

ఇవి కూడా చదవండి

మకర రాశి

మకరరాశి వారికి కెరీర్, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం ఉంది. నిలిచిపోయిన పనులు పూర్తి అయ్యేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. కొత్త ఇల్లు లేదా స్థిరాస్తికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది.

(గమనిక: పై వివరాలు జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత ఫలితాలు జన్మకుండలి, గ్రహస్థితులను బట్టి మారవచ్చు.)

Loading...
Unable to load recommendations.
Follow Us