Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం వరిస్తుంది.. పెళ్ళి తర్వాత లైఫ్‌స్టైల్‌ మారిపోతుందట!

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు పెళ్లి తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కెరీర్ వృద్ధి చెందుతుంది. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఈ సంఖ్యవారు సరైన..

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం వరిస్తుంది.. పెళ్ళి తర్వాత లైఫ్‌స్టైల్‌ మారిపోతుందట!

Updated on: Nov 07, 2025 | 6:01 PM

ఈ రోజుల్లో జాతకాలను, న్యూమరాలజీని నమ్మేవారు చాలా మంది ఉంటారు. న్యూమరాలజీ ఆధారంగా వారి భవిష్యత్తును అంచనా వేసుకుంటారు. న్యూమరాలజీ ద్వారా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చెప్పడంతో పాటు వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ప్రకారం..రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. బర్త్‌డే ఆధారంగా రాడిక్స్ నెంబర్‌ను కనుగొనవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది అంచనా వేసుకోవచ్చు. ఇలా న్యూమరాలజీ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.

పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉంటారు:

ప్రతి ఒక సంఖ్యకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. పెళ్లి తర్వాత వారి జీవితమే మారిపోతుంది. అనుకున్నదానికంటే అదృష్టం వరిస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో ఏ బాధ లేకుండా ఆనందంగా ఉంటారు. మరి పెళ్లి తర్వాత అదృష్టాన్ని పొందేవారు ఎవరు?

ఇవి కూడా చదవండి

రాడిక్స్ నెంబర్ 7:

ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఉన్నట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 7 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. కేతువు ఈ తేదీల్లో పుట్టిన వారిని మతపరమైన వాటిల్లో చురుకుగా పాల్గొనేలా చేస్తారు. అలాగే ఈ వ్యక్తులు లోతైన అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు చేసే పనిలో నిబద్దత ఉంటుంది. నిశ్శబ్దంగా ఉంటారు. ఎక్కువగా ఆలోచిస్తారు.

ఈ తేదీల్లో పుట్టిన వారు తక్కువగా మాట్లాడుతారు. గుంపుగా ఉండటం అంటే వీరికి నచ్చదు. ఈ తేదీల్లో పుట్టిన వారికి క్రియేటివిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. పరిశోధనా విద్య, ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ఇతరులతో పోల్చుకుంటే వీరు ఎక్కువ లోతుగా విషయాలను అర్థం చేసుకుంటారు. ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది.

జీవిత భాగస్వామి మద్దతుతో ఆత్మవిశ్వాసం:

న్యూమరాలజీ ప్రకారం.. ఈ తేదీల్లో పుట్టిన వారికి పెళ్లి అనేది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ తేదీల్లో పుటిన వారి జీవిత భాగస్వామి మద్దతుతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది:

ఈ తేదీల్లో పుట్టిన వారు పెళ్లి తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కెరీర్ వృద్ధి చెందుతుంది. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఈ సంఖ్యవారు సరైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితం విజయవంతమవుతుంది. ఏడవ సంఖ్య వ్యక్తులు సరైన జీవిత భాగస్వామితో కనెక్ట్ అయితే ప్రేమ సమతుల్యతను కనుగొనడమే కాదు. అదృష్టం కలిసి వస్తుంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి