Telugu News Astrology Mercury Venus Transit 2026: These Zodiac Signs May See Success in Love and Marriage
Love Astrology: బుధ, శుక్రుల పరివర్తన.. ఆ రాశుల వారికి ప్రేమ, పెళ్లి యోగాలు..!
Love and Marriage Astrology: బుధుడు–శుక్రుడి అరుదైన పరివర్తన యోగం కారణంగా కొన్ని రాశుల వారి ప్రేమ, పెళ్లి జీవితాల్లో ఆనందం, అనురాగం పెరగనున్నాయి. ముఖ్యంగా వృషభం, సింహం, కన్య, తుల, కుంభం, మీన రాశుల వారికి ఈ నెలాఖరు వరకు ప్రేమలు, వివాహాలు, దాంపత్య జీవితం శుభప్రదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
మిగిలిన గ్రహాల పరివర్తనల కంటే బుధ, శుక్రుల పరివర్తన ప్రత్యేకత సంతరించుకుంది. ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగార జీవితం, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు విజయాలు, సాఫల్యాలకు కారకుడైన బుధుడితో పరివర్తన చెందడం తప్పకుండా వ్యక్తిగత జీవితంలో సుఖ సంతోషాలను నింపుతుంది. ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్న బుధుడు మిథున రాశిలోని శుక్రుడితో ఈ నెలాఖరు వరకు పరివర్తన చెందుతున్నందువల్ల వృషభం, సింహం, కన్య, తుల, కుంభం, మీన రాశులవారి ప్రేమలు, పెళ్లిళ్లు నిత్య కల్యాణం పచ్చతోరణంలా ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది.
వృషభం: రాశ్యధిపతి శుక్రుడికి, కుటుంబ స్థానాధిపతి బుధుడికి పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారి ప్రేమ ప్రయత్నాలు తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ రాశివారు పట్టుదలకు మారు పేరైనందువల్ల ప్రేమలు, పెళ్ళి ప్రయత్నాల్లో తప్పకుండా దూసుకుపోతారు. ఇప్పటికే ప్రేమల్లో ఉన్నవారు పెళ్లి ప్రయత్నాలు సాగించే అవకాశం ఉంది. బాగా ఆస్తిపాస్తులు కలిగిన వ్యక్తితో అనుకోకుండా ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. కులాంతర వివాహనికి కూడా అవకాశం ఉంది.
సింహం: ఈ రాశికి కుటుంబ స్థానాధిపతి అయిన బుధుడితో దశమాధిపతి శుక్రుడు పరివర్తన చెందడం వల్ల ఈ రాశివారు తప్పకుండా సహోద్యోగితోనో, బంధువుతోనో ప్రేమలో పడే అవకాశం ఉంది. ప్రేమ భాగస్వామి భోగ భాగ్యాలకు, సిరిసంపదలకు లోటులేని వ్యక్తి అయి ఉండే సూచనలున్నాయి. వీరి ప్రేమ జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా సాగిపోతుంది. పెళ్లి జీవితంలో భాగంగా ప్రేమ యాత్రలు ఎక్కువగా సాగించే అవకాశం ఉంది. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది.
కన్య: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో బుధ, శుక్రుల పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారు విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో గానీ, సహోద్యోగితో గానీ తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో వీరి ప్రేమ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. జీవితంలో అన్ని విధాలా స్థిరపడిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు తప్పకుండా పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
తుల: రాశ్యధిపతి శుక్రుడు తెలివితేటలు, దూరదృష్టికి సంబంధించిన బుధుడితో పరివర్తన చెందడం వల్ల విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో లేదా సంపన్న వ్యాపారితో ప్రేమలో పడడానికి బాగా అవకాశం ఉంది. ఈ ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగిపోవడంతో పాటు పెళ్లికి దారితీసే అవకాశం కూడా ఉంది. కులాంతర ప్రేమ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ ప్రేమ వ్యవహారం తప్పకుండా సంప్రదాయబద్ధమైన పెళ్లికి దారి తీస్తుంది. వైవాహిక జీవితం కూడా సుఖసంతోషాలతో సాగిపోతుంది.
కుంభం: ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించడం జరుగుతుంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో గానీ, బంధువర్గానికి చెందిన వ్యక్తితో గానీ ప్రేమలో పడే అవకాశం ఉంది. ప్రేమ జీవితం అతి తక్కువ కాలంలోనే పెళ్లి జీవితంగా మారే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల జోక్యంతో వీరి ప్రేమలు పెళ్లికి దారి తీయడంతో పాటు, వైవాహిక జీవితం కూడా అన్యోన్యంగా సాగిపోతుంది.
మీనం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న శుక్రుడితో బుధుడికి పరివర్తన జరగడం వల్ల బాగా ఆస్తిపాస్తులున్న బంధువుతో ఈ రాశివారు ప్రేమలో పడడం గానీ, పెళ్లి చేసుకోవడం గానీ జరుగుతుంది. సహోద్యోగితో లేదా పరిచయస్థుడితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. ప్రేమ జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. శుక్ర, బుధుల పరివర్తన సమయంలో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం వల్ల ఈ రాశివారి ప్రేమ జీవితం, పెళ్లి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)