Kuja Dosha: మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!

Mars Transit into Taurus 2026: జూన్ 20 నుంచి ఆగస్టు 2 వరకు కుజుడు వృషభ రాశిలో సంచరించనున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి మాంగల్య దోషం ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మేషం, వృషభం, మిథునం, తుల, వృశ్చికం, కుంభ రాశుల వారు కుటుంబ, దాంపత్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Kuja Dosha: మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
Kuja Dosha

Edited By:

Updated on: Jun 17, 2026 | 6:45 PM

ప్రస్తుతం స్వక్షేత్రమైన మేష రాశిలో సంచారం చేస్తున్న కుజుడు ఈ నెల (జూన్) 20 నుంచి ఆగస్టు 2 వరకు 42 రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. సహజ కుటుంబ స్థానమైన వృషభంలో కుజుడి సంచారం వల్ల కొన్ని రాశులకు మాంగల్య దోషం ఏర్పడుతోంది. తమ రాశి నుంచి 1, 2, 4, 4, 7, 8, 12 రాశుల్లో కుజ సంచారం జరుగుతున్నప్పుడు కుజ దోషం లేదా మాంగల్య దోషం కలుగుతుంది. ఈ కుజ దోషం వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, వృశ్చికం, కుంభ రాశులవారికి కుటుంబ సమస్యలు, దాంపత్య సమస్యలు తలెత్తవచ్చు. ఈ రాశుల వారు ప్రతి రోజూ స్కంధ స్తోత్రాన్ని లేదా సుందర కాండను పఠించడం మంచిది.

  1. మేషం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో రాశ్యధిపతి కుజుడు సంచారం వల్ల కుజ దోషం(మాంగల్య దోషం) ఏర్పడింది. దీనివల్ల జీవిత భాగస్వామితో ఎడబాటు కలిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఎక్కువగా పర్యటనల్లో ఉండడం గానీ, దూర ప్రాంతానికి బదిలీ కావడం గానీ జరుగుతుంది. కలిసి ఉన్న పక్షంలో ప్రతి విషయానికి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఓర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది.
  2. వృషభం: ఈ రాశిలో కుజ సంచారం వల్ల మాంగల్య దోషం ఏర్పడింది. ఈ దోషం వల్ల జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కొద్దిపాటి ఎడబాటు తప్పకపోవచ్చు. బంధువుల కారణంగా ఇద్దరి మధ్యా సమస్యలు తలెత్తడం, ఒకరికొకరు దూరంగా ఉండడం, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపించడం వంటివి జరిగే సూచనలు కూడా ఉన్నాయి. దంపతుల మధ్య తరచూ కోపతాపాలు పెరుగుతాయి. దంపతుల్లో ఒకరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
  3. మిథునం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువుతో కలిసిన కుజుడి సంచారం వల్ల మాంగల్య దోష ప్రభావం అధికంగా ఉంటుంది. సుఖ సంతోషాలకు విఘాతం కలుగుతుంది. జీవిత భాగస్వామితో ఎంత ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అంత మంచిది. చిన్నచిన్న సమస్యలు, వివాదాలు చినికిచినికి గాలి వానగా పెరిగి పోయే అవకాశం ఉంది. మాట పట్టింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బంధువులు రెచ్చగొట్టే సూచనలున్నాయి. దంపతుల మధ్య ఎడబాటుకు బాగా అవకాశం ఉంది.
  4. తుల: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి మాంగల్య దోషం ఏర్పడింది. అనవసర పరిచయాలు, వ్యసనాల వల్ల దంపతుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంది. మాట తొందర పాటు ఎక్కువగా ఉంటుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. కుటుంబంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. టెన్షన్లు పెరిగే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో దాదాపు అన్ని విషయాల్లోనూ ఓర్పు, సహనాలు పాటించడం మంచిది.
  5. వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజుడి సంచారం వల్ల మాంగల్య దోషం ఏర్పడింది. దీనివల్ల వైవాహిక జీవితంలో ఆవేశకావేషాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి మీద కోపతాపాలు ప్రదర్శించడం ఎక్కువవుతుంది. ఆర్థిక, కుటుంబ సమస్యల కారణంగా దంపతుల మధ్య చిటపటలు పెరిగే అవకాశం కూడా ఉంది. వాదోపవాదాలు, మాట తొందర, ఈగో సమస్యలతో వీరు జీవితం గడపవలసి వస్తుంది. జీవిత భాగస్వామితో కొద్ది రోజుల పాటు ఆచితూచి వ్యవహరించడం మంచిది.
  6. కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడి వల్ల మాంగల్య దోషం ఏర్పడింది. అనారోగ్యాల వల్ల, ఆధిపత్య ధోరణి వల్ల దంపతుల మధ్య ఎడబాటు కలిగే అవకాశం ఉంది. అహంకారం, మొండి పట్టుదల వంటి కారణాల వల్ల ఇద్దరి మధ్యా దాంపత్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా రాజీమార్గం అనుసరించడం వల్ల, సర్దుబాటు ధోరణిని ప్రదర్శించడం వల్ల ఉపయోగం ఉండవచ్చు. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. మాట పట్టింపులకు అవకాశం ఉంది.
Loading...
Unable to load recommendations.
Follow Us