Lottery Yoga 2025: నాలుగు కంటే ఎక్కువ గ్రహాల అనుకూలత.. వారికి ఆకస్మిన ధన ప్రాప్తి..!

| Edited By: Janardhan Veluru

Dec 29, 2024 | 9:20 PM

Astrology 2025: జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాలుగు కంటే ఎక్కువగా గ్రహాలు కొన్ని రాశుల వారికి అనుకూలంగా మారనున్నాయి. ఈ అనుకూలత కలిగినవారికి లాటరీ యోగం పట్టే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి, అప్రయత్న ధన లాభం, వారసత్వ సంపద, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందడం వంటి వన్నీ లాటరీ యోగం కిందకే వస్తాయి.

Lottery Yoga 2025: నాలుగు కంటే ఎక్కువ గ్రహాల అనుకూలత.. వారికి ఆకస్మిన ధన ప్రాప్తి..!
Lottery Yoga 2025
Follow us on

Lucky Horoscope 2025: జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాలుగు కంటే ఎక్కువగా గ్రహాల అనుకూలత కలిగినవారికి లాటరీ యోగం పట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి, అప్రయత్న ధన లాభం, వారసత్వ సంపద, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందడం వంటి వన్నీ లాటరీ యోగం కిందకే వస్తాయి. రాశ్యధిపతి, ధనాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి బాగా అనుకూలంగా ఉన్నప్పుడు ఈ యోగం పడుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. వృషభం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశులకు ఈ యోగం పట్టే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి కొత్త ఏడాది ప్రారంభం నుంచి శని, రాహు, గురు, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల తప్పకుండా లాటరీ యోగం పడుతుంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆదా యం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బంతా చేతికి అందుతుంది. ఆస్తి పాస్తుల విలువ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లోనే కాక, ఉద్యోగంలో కూడా రాబడి అంచ నాలను మించుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  2. మిథునం: ఈ రాశికి జనవరి మొదటి వారం నుంచి మార్చి చివరి వరకు రాశ్యధిపతి బుధుడు, శుక్రుడు, శని, రాహు కేతువులు బాగా అనుకూలం కాబోతున్నందువల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవ కాశం ఉంది. ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. తప్పకుండా లాటరీ యోగం పట్టడం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగు తుంది. పూర్వీకుల ఆస్తిపాస్తులు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ధన యోగాలు పడతాయి.
  3. కన్య: రాశ్యధిపతి బుధుడు, శుక్రుడు, గురువు, కుజుడు, శని ఆదాయ వృద్ధికి దోహదం చేస్తాయి. ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు అంచనాలను మించుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. పిత్రార్జితానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపార ధనలాభం కలిగిస్తాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది.
  4. తుల: రాశ్యధిపతి శుక్రుడితో పాటు, బుధ, రవి, శని, రాహువులు శుభ స్థానాల్లో పర్యటిస్తున్నందువల్ల కొత్త ప్రారంభం నుంచి వీరి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడం ప్రారంభమవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపార ధన లాభాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కనక వర్షం కురుస్తుంది. ఉద్యోగంలో అధికార లాభంతో పాటు ఆదాయ లాభం కూడా కలుగుతుంది. అనుకోకుండా అత్యంత విలువైన ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వీరికి తప్పకుండా లాటరీ యోగం పడుతుంది.
  5. వృశ్చికం: ఈ రాశివారికి రాశ్యధిపతి కుజుడితో పాటు, గురువు, రవి, బుధ, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు నూరు శాతం సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితికి సంబంధించినంత వరకూ కొత్త ఏడాది వీరి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు దాదాపు కనక వర్షం కురిపిస్తాయి.
  6. మకరం: ఈ రాశికి రాశ్యధిపతి శని, శుక్రుడు, రాహువు, బుధుడు, గురువు బాగా అనుకూలమవుతు న్నందు వల్ల అనేక పర్యాయాలు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. కొత్త సంవత్సరంలో వీరి ఆర్థిక జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోయే సూచనలున్నాయి. రావలసిన డబ్బంతా చేతికి అందుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి. ఒకటి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి పెరుగుతుంది.