Guru Gochar: గురువు కటాక్షం.. నవంబర్ లోగా వారు కుబేరులు అవుతారు..!

Jupiter Transit 2026: జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలో సంచారం చేయనున్నాడు. ఈ ప్రభావంతో హంస మహాపురుష యోగం, మహాభాగ్య యోగాలు ఏర్పడి మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ధనలాభాలు, రాజయోగ ఫలితాలు కలగనున్నాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

Guru Gochar: గురువు కటాక్షం.. నవంబర్ లోగా వారు కుబేరులు అవుతారు..!
Jupiter Transit 2026

Edited By:

Updated on: May 21, 2026 | 2:07 PM

ప్రస్తుతం మిథున రాశిలో సంచారం చేస్తున్న దేవ గురువు జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు తనకు ఉచ్ఛ క్షేత్రమైన కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఆ తర్వాత కొద్ది కాలం పాటు సింహరాశిలో సంచారం చేసి మళ్లీ కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. 1, 4, 7, 10 స్థానాల్లో గురువు ఉచ్ఛ, స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నప్పుడు హంస మహా పురుష యోగమనే అత్యున్నత స్థాయి రాజయోగం కలుగుతుంది. అదే విధంగా గురువు 2, 9, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు మహా భాగ్య యోగం కలుగుతుంది. దీని ప్రకారం మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులవారు ధన, రాజయోగాలను అనుభవించబోతున్నారు.

  1. మేషం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి హంస మహా పురుష యోగం కలిగింది. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా వీరి హోదా, స్థాయి పెరుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ధన, రాజయోగాల పడతాయి. ఆదాయం అనేక రెట్లు పెరిగి సంపన్నులు కావడం జరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి.
  2. మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల ఆదాయం పెరగడమే కానీ తగ్గడం ఉండదు. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నతోద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంటపండుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి హంస మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల వీరికి రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, హోదాలు పెరుగుతాయి. అనారోగ్యాలకు తగిన చికిత్స లభిస్తుంది. కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పట్టే అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశికి గురువు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం వల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగం కలిగి, అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ప్రభుత్వమూలక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యో గంలో హోదాతోపాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది.
  5. తుల: ఈ రాశికి దశమ కేంద్రంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి హంస మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రభుత్వ గుర్తింపుతో పాటు ధన లాభం కలుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.
  6. వృశ్చికం: ఈ రాశికి భాగ్యస్థానంలో ధనాధిపతి గురువు ఉచ్ఛపట్టడం వల్ల, అపర కుబేర యోగం కలుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవడం లేదా అటువంటి వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు, నిరు ద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపా రాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  7. మకరం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం ప్రారంభించడం వల్ల హంస మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. అనేక విధాలుగా ధనాభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో శక్తి, సామర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు తప్పకుండా లాభాల బాటపడతాయి.
  8. మీనం: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ పట్టడం వల్ల ఈ రాశివారికి అక్టోబర్ 31 వరకు జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఏలిన్నాటి శని ప్రభావం పూర్తిగా మటుమాయం అవుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అదనపు ఆదాయ మార్గాలన్నీ బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us