Telugu News Astrology Job Astrology in Telugu: These zodiac signs to have best time in career after sankranti check astro predictions for your sign in telugu
Job Astrology: ఆ రాశుల వారికి సంక్రాంతి తర్వాత అధికార యోగం.. ఉద్యోగ పదోన్నతులు పక్కా.. !
త్వరలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? మరింత ఉద్యోగంలోకి మారడం జరుగుతుందా? కోరు కుంటున్న ప్రాంతానికి బదిలీ లేదా స్థాన చలనం ఉంటుందా? పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల, గుర్తింపు వంటి విషయాలకు సంబంధించి ఉద్యోగంలో శుభ వార్తలు వింటామా? కొన్ని రాశుల వారి విషయంలో తప్పకుండా ఈ ప్రశ్నలకు సంబంధించి సానుకూల సమాధానాలు దొరుకుతాయి.
త్వరలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? మరింత ఉద్యోగంలోకి మారడం జరుగుతుందా? కోరు కుంటున్న ప్రాంతానికి బదిలీ లేదా స్థాన చలనం ఉంటుందా? పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల, గుర్తింపు వంటి విషయాలకు సంబంధించి ఉద్యోగంలో శుభ వార్తలు వింటామా? కొన్ని రాశుల వారి విషయంలో తప్పకుండా ఈ ప్రశ్నలకు సంబంధించి సానుకూల సమాధానాలు దొరుకుతాయి. ఏప్రిల్ లోగా ఆరు రాశుల వారికి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దశమాధిపతి, దశమ స్థానం అనుకూలతల వల్ల మేషం, వృషభం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి ఆశించిన శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
మేషం: ఈ రాశివారికి దశమ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు లాభస్థానంలో సంచరిస్తున్నందువల్ల, నాలుగైదు రోజుల్లో రవి కూడా దశమ (ఉద్యోగ) స్థానానికి వస్తున్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. పదోన్నతికి, జీతభత్యాలు పెరగడానికి, మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి, ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కావడానికి అవకాశాలున్నాయి. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగంలో స్థిరపడడానికి అవకాశం ఉంది.
వృషభం: ఈ రాశికి ఉద్యోగ స్థానాధిపతి శని ఉద్యోగ స్థానంలోనే ఉన్నందువల్ల ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం లభిస్తాయి. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితం ఉంటుంది. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. బదిలీ లేక స్థాన చలనానికి అవకాశం లేకపోవచ్చు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారడం కంటే ప్రస్తుత ఉద్యోగంలోనే శుభ ఫలితాలు అనుభవానికి రావడం, అదృష్టం పట్టడం జరుగుతుంది.
కన్య: దశమ స్థానం మీద శుభ గ్రహాల దృష్టి వల్ల ఈ రాశివారికి ఉద్యోగపరంగా అనేక శుభాలు జరగబోతున్నాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు, జీతభత్యాలు పెరగడానికి కూడా అవకాశం ఉంది. సంక్రాంతి తరువాత వీరి జీవితంలో తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకుం టాయి. ఊహించని విధంగా అధికార యోగం పడుతుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు న్నాయి. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందివస్తాయి.
ధనుస్సు: ఈ రాశివారికి సంక్రాంతి తర్వాత ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతితో కూడిన బదిలీకి అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడం కూడా జరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు కూడా బాగా సానుకూలపడతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు అనేక ఆఫర్లు అంది వస్తాయి. ఉద్యోగంలో అధికారం చేపట్టడంతో పాటు, జీతభత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ జీవితం చాలావరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
కుంభం: ఈ రాశివారికి ఉద్యోగ స్థానం, ఉద్యోగ స్థానాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆశించిన ఉద్యోగంలోకి మారడానికి కూడా అవ కాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నమైనా సానుకూల ఫలితాలనిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగ భద్రత, స్థిరత్వం లభిస్తాయి. పదోన్నతికి, ప్రాధాన్యం పెరగడానికి కూడా అవకాశం ఉంది.
మీనం: ఈ రాశివారికి మే వరకూ ఉద్యోగ స్థానంలో శుభ గ్రహ సంచారం జరుగుతున్నందువల్ల ఉద్యోగ జీవితం ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా సంక్రాంతి ప్రాంతంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు. ఉద్యోగులకు స్థాన చలనానికి, బదిలీలకు అవకాశం లేదు కానీ, ఉద్యోగం మారడానికి మాత్రం అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి.