Horoscope Today: ఈ రాశివారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. ఇతరుల నుంచి ప్రశంసలు

|

Dec 08, 2021 | 4:48 AM

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి..

Horoscope Today: ఈ రాశివారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. ఇతరుల నుంచి ప్రశంసలు
Follow us on

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. డిసెంబర్‌ 8 (బుధవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:
కొన్ని వ్యవహారాలలో ప్రశంసలు అందుకుంటారు. ఆలోచనతో ముందుకు సాగాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది.

వృషభ రాశి:
ఏదైనా విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి:
ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. కీలక అంశాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ధైర్యమే మీరు చేపట్టే పనులు విజయవంతం అవుతాయి.

కర్కాటక రాశి:
అధికారుల సహాయం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల ఆశీర్వాదంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

సింహ రాశి:
మీమీ రంగాలలో అనుకున్నది సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి:
బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో ఒక శుభవార్తను వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

తుల రాశి:
కీలక విషయాలలో పెద్దల సహకారం తీసుకుంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి:
మంచి ఆలోచనలతో పనులు ప్రారంభిస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధించి తీరుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనుస్సు రాశి:
మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. మీ ఆలోచనలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.

మకర రాశి:
శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టే పనులు పూర్తి చేస్తారు.

కుంభ రాశి:
చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇష్ట దైవాన్ని పూజించడం మంచిది.

మీన రాశి:
చేపట్టే పనులలో పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Feet Touching Rules : ఒకరి పాదాలను తాకేటప్పుడు ఈ ఐదు విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి..

Sabarimala: శబరిమలకు భక్తుల తాకిడి.. భారీవర్షాల నేపధ్యంలో ఇబ్బందులు..