
దిన ఫలాలు (నవంబర్ 11, 2026): మేష రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృషభ రాశి వారు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. మిథున వారికి వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలపరంగా దూసుకుపోతారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో స్నేహితుల సహాయ సహకారాలందుతాయి. ఆదాయం బాగా పెరిగి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మీ సలహాల వల్ల బంధుమిత్రులు ఆశించిన లబ్ధి పొందుతారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి.
ఉద్యోగంలో అధికారులు మీ సమర్థతను గుర్తించి ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు చేయూతనందిస్తారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. మిత్రులవల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయ్యే సూచనలున్నాయి. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఇప్పుడు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవు తాయి. విద్యార్థులు అతి తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబపరంగా కొన్ని చికాకులు ఎదురవుతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులుంటాయి.
వృత్తి, ఉద్యోగాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఇంటా బయటా పనిభారం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని చక్కదిద్దా ల్సిన అవసరం ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగానే ఉంటాయి. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా, సానుకూలంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా పురోగమి బస్తాయి. ప్రతి చిన్న పనికీ ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. సహాయం పొందినవారు ముఖం చాటేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను స్వయంగా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. చదువుల్లో పిల్లల పనితీరు పరవాలేదనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా చికాకులుంటాయి.
రోజంతా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పురోగమిస్తాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండ వచ్చు. గట్టిగా ప్రయత్నిస్తే వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువుల్లో బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగతి చెందుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి ప్రయ త్నం సఫలమవుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు, తల్లితండ్రుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా నడుస్తాయి.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా శ్రమాధిక్యత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగు తాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వేధింపులు కూడా తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. రాబడి బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ప్రతి పనీ ఆలస్యమవుతుంటుంది. కొద్దిగా చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబపరమైన వ్యవహారాలను చక్కబెడతారు.
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. పదోన్నతికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాల్ని మించి లాభాలు గడిస్తారు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
Also Read: పౌర్ణమి వరకు వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం..జీవితంలో అన్ని శుభాలే..