Horoscope Today (06-03-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుందని … మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 6వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. స్థిర నిర్ణయాలను తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ప్రతిఫలాన్ని అందుకుంటారు. చేపట్టిన పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కీలక వ్యవహారాలలో ముందుకు వెళ్లాలంటే నిర్లక్ష్యాన్ని వీడండి. కొన్ని పరిస్థితులు ఈ రాశివారికి నిరుత్సాహపరుస్తాయి.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధుమిత్రులను కలిసి ఆనందంగా కలుస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. మానసిక బలంతో చేపట్టిన పనుల్లో ఫలితాలను అందుకోవాల్సి ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభించేలా కష్టపడాల్సి ఉంటుంది.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు. అభివృద్ధి పనుల గురించి ఆలోచిస్తారు. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు అందరిని కలుపుకుని పోవడం వలన మంచిది. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమయానికి తగిన నిద్రాహారాలు అవసరం
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కీలక విషయాల్లో తగిన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు సంతోషకరమైన వార్త వింటారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది. ఆత్మీయుల నుంచి ప్రేమాభిమానాలు అందుకుంటారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయుల ప్రేమాభిమానులను సొంతం చేసుకుంటారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధికంగా శుభ ఫలితాలు అందుకుంటారు. కీలక పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు డబ్బులు ఖర్చు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగితే సత్పలితాలు అందుకుంటారు.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారువృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తప్పనిసరి. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాలను అందుకుంటారు.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read: