Horoscope Today (27-03-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా తమకు ఈరోజు ఎలా ఉంటుందని .. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే వెంటనే తమ దినఫలాల (Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 27వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి స్నేహితుల వలన మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధన వ్యక్తం చేస్తారు.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి సక్సెస్ అందుకుంటారు. కుటుంబలో చిన్నపాటి సమస్యలు ఎదుర్కొంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకుని ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు అందుకుంటారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్ధిక ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. విందు, వినోద, కార్యక్రమాలలో పాల్గొంటారు. అధిక శ్రమ కలుగుతుంది. అపవాదులు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో ఆచితూచి మెలగాల్సి ఉంటుంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఉత్సాహంగా పనిచేస్తారు. . బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రారంభించబోయే పనుల్లో విజయం చేకూరుతుంది. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. కొన్ని సంఘటనలు సంతోషాన్ని ఇస్తాయి.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొందరి ఆలోచనా తీరు బాధను కలిగిస్తుంది.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు. బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభ రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమ అధికంగా పడాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో విబేధాలు రావచ్చు. కుటుంబ సలహాలతో ముందుకు సాగడం మంచిది.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు అవసరానికి తగిన డబ్బులను అందుకుంటారు. ఇతరుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో సంతోషముగా గడుపుతారు.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read:
Ashwagandha: అశ్వగంధ పురుషులకు దివ్య ఔషధం.. లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!