Horoscope Today: ద్వాదశ రాశిఫలాలు: ఈ 5 రాశులకు ధనయోగం.. ఆదాయం పెరిగి అదృష్టం తలుపుతడుతుంది!

Today Horoscope (June 8 2026): జూన్ 8, 2026 రాశిఫలాల ప్రకారం మేషం, మిథునం, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, వ్యాపారాల్లో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు, శుభవార్తలు లభించే సూచనలు ఉన్నాయి. మీ రాశి ఫలితం ఎలా ఉందో తెలుసుకోండి.

Horoscope Today: ద్వాదశ రాశిఫలాలు: ఈ 5 రాశులకు ధనయోగం.. ఆదాయం పెరిగి అదృష్టం తలుపుతడుతుంది!
Daily Horoscope Telugu

Edited By:

Updated on: Jun 08, 2026 | 6:00 AM

దిన ఫలాలు(జూన్ 8, 2026): ఈరోజు కొన్ని రాశులకు ఎంతో అనుకూలంగా ఉంది. మరికొన్ని రాశులకు సాధారణంగా ఉంది. ద్వాదశ రాశులలో ఈరోజు ఏయే రాశులకు అదృష్టం కలిసివస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా ఆశించిన ఫలితాలని స్తుంది. మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యో గాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. బాకీలు వసూలవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవ కాశం ఉంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ధన స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు, బుధుడి సంచారం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి నుంచి ఉప శమనం లభిస్తుంది. ఎటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ పురోగతి ఉంటుంది. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి రాణిస్తాయి. కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆస్తి వివాదాల్లో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ప్రస్తుతానికి లాభ స్థానం, ధన స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన ఏ వ్యవహారమైనా సాను కూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో కష్టానికి మించిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ జీవితం కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యం పట్ల జాగ్తత్త.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ స్థానం, లాభ స్థానం బలంగా ఉన్నందువల్ల ఉద్యోగ రీత్యా లాభాలు పొందడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి చెందుతాయి. ఆస్తి వివా దం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. తోబుట్టువుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యయంలో బుధ, శుక్రుల సంచారం కారణంగా ముఖ్యమైన వ్యవహారాలు ఆలస్యం కావడంతో పాటు, ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

లాభ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో రాశ్యధిపతి రవి ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూలంగా పూర్తవుతుంది. బుధ, కుజులు కూడా అనుకూలంగా మారడం జరుగుతోంది. ఆదాయం పెరుగుతుంది కానీ, కుటుంబ ఖర్చులు అదుపు తప్పుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన మంచి సమాచారం అందుకుంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ధన కారకుడైన గురువు లాభ స్థానంలో ఉండడం, దశమ స్థానంలో శుక్ర, బుదులు కలిసి ఉండ డం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగ మిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవు తాయి. ఆర్థిక, వ్యక్తిగతసమస్యలు పరిష్కారం అవుతాయి. కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రాశికి దశమ స్థానంలో శుభ గ్రహమైన గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, భాగ్య స్థానంలో బుద, శుక్రులు సంచారం చేయడం వల్ల వల్ల ఆదాయం ఆశించిన దాని కంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. లాభ స్థానంలో శనీశ్వరుడి వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వినడం, వృద్ధి లోకి రావడం వంటివి జరుగుతాయి. స్నేహితులతో విలాసాల మీద బాగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రాశ్యధిపతి కుజుడి స్వస్థాన సంచారం వల్ల, భాగ్య స్థానంలోని గురువు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో సమ స్యలు పరిష్కారమై పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుజుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఆరోగ్యం చక్కబడడం, దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కోలుకోవడం వంటివి జరుగుతాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయానికి లోటుండదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, బుధ, శుక్రులు సప్తమ స్థానంలో సంచారం చేస్తుం డడం వల్ల తప్పకుండా మంచి అదృష్ట యోగం పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. పితృ కారకుడైన రవి షష్ట స్థానంలో సంచరిస్తున్నందువల్ల తండ్రి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రవి, బుధ, శని, కుజుల అనుకూలత వల్ల ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. ఆచితూచి ఖర్చు చేయడానికి, ఖర్చులు అదుపులో ఉండడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానంలో ఉన్న గురువు వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనవ సర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కొన్ని శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

మూడు శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల, ఆదాయం పరిస్థితి గణనీయంగా మెరుగు పడుతుంది. కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది.వృత్తి, వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న శనీశ్వరుడి కారణంగా అప్పుడప్పుడు శ్రమ, స్వల్ప అనారో గ్యాలు తప్పవు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆదాయ వృద్ధి ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఆదాయ వృద్ధికి, సుఖ సంతో షాలకు, ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమ‍స్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. కొందరు మిత్రుల కారణంగా డబ్బు వృథా కావడం, నష్టపోవడం జరుగుతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

Follow Us