జూన్ 9 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్.. మీ రాశికి ఇలా..

దిన ఫలాలు (జూన్ 9, 2026): మేష రాశి వారు ఏ ప్రయత్నం ప్రారంభించినా విజయాలు సాధించే అవకాశం ఉంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి లాభాలు పొందుతారు. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థితి లభించవచ్చు. వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు అన్ని 12 రాశుల వారికి ఈ రోజు మంగళవారానికి సంబంధించిన రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

జూన్ 9 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్.. మీ రాశికి ఇలా..
Horoscope Today 09 June 2026

Edited By:

Updated on: Jun 09, 2026 | 6:00 AM

దిన ఫలాలు (జూన్ 9, 2026): మేష రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందుతారు. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్లడానికి అవకాశముంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. మిథున రాశి వారికి ఆర్థిక లాభాలకు లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ తప్పకుండా పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ రాశివారి ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సామాజికంగా ప్రాభవం పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త అందుకుంటారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

లాభ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్లడానికి అవకాశముంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. సామాజిక హోదా పెరుగుతుంది. నిరుద్యోగుల కల నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. పిల్లలు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. గ్రహ బలం అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక లాభాలకు లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులు, అవివాహితులకు శుభవార్తలు అందుతాయి. అదనపు ఆదాయానికి అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారాలు ఆర్థికపరంగా బాగా అనుకూలంగా ఉంటాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

శుక్ర, గురువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు. ఆదాయ వనరులు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఉండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రవి, కుజుల కొద్దిపాటి అనుకూలత వల్ల ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాల వల్ల సామాజిక హోదా పెరుగుతుంది. మీ పని తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. నిరుద్యోగులు ఆశించిన సంస్థలో ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

లాభ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు. సప్తమ శని ప్రభా వం వల్ల వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రతి పని లోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రాశివారికి శుభ గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండడం వల్ల రోజంతా సానుకూలంగా సాగి పోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తయి, ఊరట లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహకాలు లభిస్తాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో ఘన విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఈ రాశివారికి ప్రస్తుతం గురు, కుజులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. పెండింగు పనులకు అవకాశముండదు. ప్రతి వ్యవహారం లాభసాటిగా పూర్తవుతుంది. వ్యాపారపరంగా ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆదాయం మరింతగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కుజ, బుధ, రాహువుల అనుకూల సంచారం వల్ల కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశముంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. కొద్దిపాటి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

గురు, శుక్ర, రవుల అనుకూలత వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ప్రతిభాపాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల్లో మాటకు, చేతకు విలువ ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాలు ఆర్థికంగా పురోగమిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ప్రస్తుతానికి ఎవరికీ ఎలాంటి హామీలు ఉండవద్దు. వాగ్దానాలు చేయవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. సర్వత్రా ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి చేయకపోవడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న గురువు వల్ల అనేక విధాలుగా డబ్బు కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. శత్రువులు, పోటీదార్లు, ప్రత్యర్థుల సమస్యల మీద పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Follow Us