Horoscope Today: ఈరోజు ఈ రాశులవారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఆదివారం రాశిఫలాలు..

|

Oct 16, 2022 | 6:52 AM

ఈరోజు వీరికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

Horoscope Today: ఈరోజు ఈ రాశులవారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఆదివారం రాశిఫలాలు..
Horoscope
Follow us on

మేషరాశి..
ఈరోజుూ వీరికి స్థానచలన సూచనలు ఉంటాయి. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి.

వృషభరాశి..
ఈరోజు వీరు దూర బంధువులతో కలుస్తారు. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.

మిథున రాశి..
ఈరోజు వీరికి మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.

ఇవి కూడా చదవండి

కర్కాటకరాశి..
ఈరోజు వీరికి మానసిక ఆనందం లభిస్తుంది. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి.

సింహరాశి..
ఈరోజు వీరికి అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్నిపనులు చెడిపోతాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కన్యరాశి..
ఈరోజు వీరికి బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూల‌కంగా శ‌తృబాధ‌ల‌ను అనుభ‌విస్తారు. ఏదో ఒక విష‌యం మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది. ప్రయ‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి.

తుల రాశి..
ఈరోజు వీరికి అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. వీరికి కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది.

వృశ్చిక రాశి..
ఈరోజు వీరికి ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు.

ధనుస్సు రాశి..
ఈరోజు వీరు ఆరోగ్యం గురించి శ్రద్ధ వ‌హించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆత్మీయుల సహాయ సహకారాలకోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.

మకర రాశి..
ఈరోజు వీరు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేక పోతారు. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది.

కుంభరాశి..
ఈరోజు వీరికి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు.

మీన రాశి..
ఈరోజు వీరికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.