దిన ఫలాలు (జనవరి 27, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభ రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. బంధు మిత్రులకు వీలైనంతగా సహాయపడతారు. కుటుంబంతో వెళ్లి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. తలపెట్టిన వ్యవహారాలను పట్టు దలగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. అధికారుల నుంచి సహాయ సహ కారాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన ఉంటుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొం టారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు ముందుకు వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల చదు వుల విషయాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. దైవ దర్శ నాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా కాస్తంత పని భారం తప్పకపోవచ్చు. కుటుంబ సమస్యలు, తోబుట్టువులతో విభేదాలు పరిష్కారం అవు తాయి. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు ఒక మోస్తరుగా ముందుకు సాగుతాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అంది వస్తాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఆచితూచి అడుగువేయడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
దాదాపు అన్ని రంగాలవారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అను కున్నట్టు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గృహ, వాహన సౌఖ్యాల మీద దృష్టి సారిస్తారు. పిల్లలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు, వివాదాల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులను ఆలస్యంగానే అయినా సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాలు చాలావరకు కలిసి వస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఇతరులకు ఆర్థికంగా వీలైనంతగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. అనేక కార్యాలను ఒకేసారి చక్కబెట్టే ప్రయత్నం చేయవద్దు. మానసిక ఒత్తిడికి అవ కాశం ఉంది. కుటుంబ బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగు తాయి. సహోద్యోగుల పనిభారాన్ని కూడా పంచుకోవాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. స్కెక్యులేషన్ లాభిస్తుంది. మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయా ణాల్లో, ముఖ్యంగా సొంత డ్రైవింగ్ లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవ హారాల్లో కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఇంటా బయటా సరైన పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఎంతో ఉత్సాహంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొందరు స్నేహితుల కారణంగా ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. మానసికంగా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక ఉండకపోవచ్చు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఆదాయం, ఆదాయ మార్గాలు పెరు గుతాయి. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటి వాతావరణంలో ప్రశాంతత లోపిస్తుంది. కోపతాపాలను తగ్గించుకోవడం మంచిది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామితో సంప్రదించాల్సి ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండే అవ కాశం ఉంది. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధువర్గం నుంచి పెళ్లి విషయంలో శుభవార్తలందుతాయి. ప్రయాణాల్లో మంచి పరిచ యాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొంటారు.