Horoscope Today: ఆ రాశుల వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.. మంగళవారం రాశి ఫలాలు..

Rasi Phalalu Today: ప్రతీరోజూ మనం అవసరం లేని విషయాల్లో కూడా తల దూర్చడానికి ప్రయత్నిస్తుంటాం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ముందు వెనుక

Horoscope Today: ఆ రాశుల వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.. మంగళవారం రాశి ఫలాలు..
Horoscope Today

Updated on: Jun 15, 2021 | 7:25 AM

Rasi Phalalu Today: ప్రతీరోజూ మనం అవసరం లేని విషయాల్లో కూడా తల దూర్చడానికి ప్రయత్నిస్తుంటాం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మంగళవారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంది. అసలు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి పరిశీలిద్దాం.

మేష రాశి: ఈ రాశి వారు ఈ రోజు చేపట్టినటువంటి పనుల్లో ఏమాత్రం తొందరపడకూడదు. పెద్దవారి సూచనలతో ముందుకెళితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయస్వామి వారి అర్చన మేలు చేస్తుంది

వృషభరాశి: ఈ రాశి వారు ఈ రోజు అనుకోనటువంటి గౌరవప్రదమైన వ్యక్తులను కలుస్తారు. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడంలో శుభ ఫలితాలను పొందుతారు. మహాగణపతికి గరికను సమర్పణ చేసుకోవడం మంచిది.

మిథున రాశి: ఈ రాశి వారు ఇతరులతో వ్యవహరించేటప్పుడు.. ముఖ్యంగా ఒప్పందాలు, హామీల విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. శివపంచాక్షరి స్తోత్రము అలాగే జపం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారు వేరువేరు రూపాల్లో సంఘ వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఆధిత్యహృదయ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

సింహ రాశి: ఈ రాశివారికి ఈ రోజు చిన్నచిన్న ఆనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతుంటాయి. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో ఆలోచనలు చేసి నిర్ణయం తీసుకోవాలి. రాజరాజేశ్వరి అమ్మవారి పారాయణం మేలు చేస్తుంది. .

కన్యా రాశి : ఈ రాశి వారు ఈ రోజు పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. బంధువులు, సంతానం విషయంలో కొంత ఆందోళన చెందుతుంటారు. విష్ణుమూర్తికి తులసీ అర్చన నిర్వహించుకోవడం మంచిది.

తులా రాశి: ఈ రాశి వారు ఈ రోజు చేపట్టినటువంటి పనుల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆహార, విహారాల్లో చిన్నచిన్న ఇబ్బుందులు కలుగుతుంటాయి. శివాలయ దర్శనం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ రోజు సామాజిక గౌరవం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కళాకారులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ధన్వంతరి స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.

ధనస్సు రాశి: ఈ రాశి వారు ఈ రోజు మధ్యవర్తిత్వ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీస్తుంటాయి. విష్ణుమూర్తి ఆరాధన మేలు చేస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంటుంది. వ్యాపార విషయాల్లో పెద్దవారి సలహాలు తీసుకోవడం మంచిది. అష్టలక్ష్మీ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈ రోజు ప్రాయాణపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దూబార ఖర్చులు పెరుగుతుంటాయి. నియంత్రణ చేసుకోవడం మంచిది. అష్టలక్ష్మీ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మీన రాశి: ఈ రాశి వారికి సేవకుల ద్వారా వేర్వేరు రూపాల్లో ప్రయోజనాలు, లాభాలు ఏర్పడుతుంటాయి. గతంలో నిలిచిపోయిన పనులను ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. గణపతి స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.

Also Read:

UP Borewell Rescue Boy Safe: ఎట్టకేలకు ఫలించిన అధికారుల ప్రయత్నాలు.. బోరుబావిలో నుంచి క్షేమంగా బయటపడ్డ నాలుగేళ్ల బాలుడు

Loading...
Unable to load recommendations.
Follow Us