Horoscope Today: ఆ రాశి వారు ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు..

| Edited By: Janardhan Veluru

Feb 15, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 15, 2024): మేష రాశి వారికి ఉద్యోగం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారు ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు..
Horoscope Today 15th February 2024
Follow us on

దిన ఫలాలు (ఫిబ్రవరి 15, 2024): మేష రాశి వారికి ఉద్యోగం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. పలుకు బడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. సేవా కార్యక్రమాల్లో గానీ, సహాయ కార్యక్రమాల్లో గానీ పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడవచ్చు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకుంటారు. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఇతరుల వ్యవహా రాల్లో తలదూర్చవద్దు. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల కారణంగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటిం చడం మంచిది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు మీదపడే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆర్థిక ప్రయ త్నాలు కూడా అనుకూల ఫలితాలనిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కోలుకునే సూచన లున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వైద్య ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఇతరులకు ఆర్థి కంగా మేలు జరిగే పనులు చేస్తారు. రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము చేతికి అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

బాగా కలిసి వచ్చే సమయం ఇది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యో గాలపరంగానే కాకుండా, కుటుంబపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. విలా సాలు, వ్యసనాల మీద డబ్బు బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగు తుంది. విహార యాత్రకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, శ్రమ పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. మంచి మిత్రులు పరిచయం అవుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ )

ఇంటా బయటా అనుకూలతలుంటాయి. ఉద్యోగ జీవితం యథా ప్రకారం సాగిపోతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయ పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల, చేసే ప్రయత్నాల వల్ల మున్ముందు కలిసి వస్తుంది. నిరుద్యోగులు శుభ వార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆస్తి వివాదం సమసిపోతుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయ పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సినవారు తిరిగి ఇస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపా రాల్లో సంపాదన అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మనసు లోని కోరిక ఒకటి నెరవేరుతుంది. కుటుంబానికి సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సాను కూలపడతాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే సూచన లున్నాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. వివాహ ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం ప్రారంభిస్తే అది నెరవేరుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బాగా ఇష్టమైన చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.