Horoscope Today: ఆ రాశుల వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది.. గురువారం దినఫలాలు

| Edited By: Shaik Madar Saheb

Mar 14, 2024 | 6:55 AM

దిన ఫలాలు (మార్చి 14, 2024): మేషం రాశి వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. మిథునం రాశి వారికి వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశుల వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది.. గురువారం దినఫలాలు
Horoscope Today
Follow us on

దిన ఫలాలు (మార్చి 14, 2024): మేషం రాశి వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. మిథునం రాశి వారికి వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికీ బాగుంటుంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. పోటీదార్ల బెడద చాలా వరకు తగ్గుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. కోపతాపాలను బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. బంధువుల నుంచి విమర్శలు ఎదురవుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థానాలతో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు బాగుంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో చికాకులుంటాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ నమస్యలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అనుకోకుండా కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీ సలహాలు, సూచనల ద్వారా లబ్ధి పొందుతారు. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలుంటాయి. రావలసిన డబ్బు చేతికి అంది, ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కుటుంబ అవసరాల మీద భారీగా ఖర్చవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైతం ఊరట లభిస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. మీ మాట చెలామణీ అవుతుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలుంటాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమల్లో ముందడుగు వేస్తారు.

వృ‌శ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

అనుకున్నపనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించినంతగా సంపాదన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. కొందరు సన్నిహితులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. బంధువులకు బాగా సహాయం చేయడం జరుగుతుంది. పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకోవడం చాలా మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఊహించని విధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ సమస్యల్లో ముఖ్యమైనవి పరిష్కారం అవుతాయి. కొత్త నిర్ణయాలకు, కొత్త కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రోజంతా హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ప్రముఖులతో కలిసి మెలిసి తిరుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాలకు హాజరవుతారు. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపడతారు. ఉద్యోగంలో సహోద్యోగులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యుల ద్వారా ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృథా ఖర్చులు బాగా తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.