దిన ఫలాలు (మార్చి 11, 2024): మేష రాశి వారి నిరుద్యోగులకు ఆశించిన వర్తమానం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో పనిభారం చాలా వరకు తగ్గుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
నిరుద్యోగులకు ఆశించిన వర్తమానం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ఉద్యోగులు మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో తప్పకుండా అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా వరకు అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిర్ణయాలు, ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, వ్యాపారాలలో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఎవరితోనూ తొందర పాటు మాటలు మాట్లాడవద్దు. ఇరుగు పొరుగుతో వివాదాలు తలెత్తే సూచనలున్నాయి. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ విషయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో పనిభారం చాలా వరకు తగ్గుతుంది. గౌర వాభిమానాలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. నిరుద్యోగులు తప్ప కుండా శుభవార్త వింటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ముఖ్య మైన వ్యవహా రాల్లో కార్యసిద్ధి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా సఫలం అవుతుంది. వివాహ ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి. పిల్లల్లో ఒకరు చదువుల్లో గానీ, ఉద్యోగపరంగా గానీ ఆశించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు, వ్యవహారాలు నత్తనడక నడు స్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొందరు బంధువులతో స్వల్ప విభేదాలకు అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు మామూలు ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలలో, వాహనాలతో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. లాటరీ, జూదం, వడ్డీ వ్యాపారం వంటి వాటి వల్ల ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఉద్యో గంలో మంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. మీ ప్రయత్నాలు, ఆలోచనలు, నిర్ణయాలు ఫలి స్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. చేప ట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. చిన్న నాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లల అభివృద్ధికి సంబంధించి ఒకటి రెండు అనుకూల వార్తలు వింటారు. తల్లితండ్రులు, కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయ. ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహ కరంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రారంభించిన పనులు చురుకుగా పూర్తవుతాయి. ప్రయాణాలు వాయిదా వేయ వలసి వస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార వ్యవహారాలు చురుకుగా ముందుకు సాగుతాయి. లాభాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల్లో డబ్బు నష్టపోతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశముంది. జీవిత భాగస్వామికి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలో కొద్దిగా ఒడిదుడుకులుంటాయి. ఉద్యోగంలో బాగా ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. వ్యాపారంలో మరింత శ్రద్ధపెట్టడం అవసరం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం కూడా మంచిది కాదు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
బాకీలు, బకాయిలు వసూలువుతాయి. చాలావరకు అవసరాలు తీరిపోతాయి. కుటుంబ సభ్యుల సమస్యలపై శ్రద్ధ పెట్టడం మంచిది. సన్నిహితులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఇతరులకు ఆర్థిక సహాయం చేయడంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు దిగడం శ్రేయస్కరం కాదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. రాజకీయ ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ధన లాభం పొందుతారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐ.టి నిపుణుల వంటి వృత్తుల వారు పురోగతి చెందుతారు. ప్రయాణా ల్లోనూ, ఆహార, విహారాల్లోనూ జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆర్థిక ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనం పొందుతారు. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి.