Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయ వృద్ధి సూచనలు.. 12రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

| Edited By: Ravi Kiran

Oct 08, 2024 | 7:05 AM

దిన ఫలాలు (అక్టోబర్ 8, 2024): మేష రాశి వారు వ్యక్తిగత సమస్యల విషయంలో కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయ వృద్ధి సూచనలు.. 12రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today
Follow us on

దిన ఫలాలు (అక్టోబర్ 8, 2024): మేష రాశి వారు వ్యక్తిగత సమస్యల విషయంలో కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం విషయంలో ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సత్ఫలితాలనిస్తుంది. వ్యాపారాల్లో చిన్నపాటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యల విషయంలో కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. అధికారులతో అనుకూలతలు వృద్ధి చెందుతాయి. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలుంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ఒత్తిడి, శ్రమ చాలావరకు తగ్గిపోతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరో గ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలవికాని లక్ష్యాలు, బాధ్యత లను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. కుటుంబ ఖర్చులు ఎక్కు వయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధుమిత్రుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిల కగడా సాగిపోతుంది. వ్యాపారాలు లాభాలపరంగా పురోగతి చెందుతాయి. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతల్ని నెత్తికెత్తుకోవడం వల్ల ఫలితం ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థిక సహా యం చేయడం జరుగుతుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి లాభం పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవ కాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. అనుకున్న పనుల్లో ఒకటి రెండు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో మీ పనితీరు పట్ల అధికారులు సంతృప్తి చెందుతారు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందు తాయి. బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు న్నాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహ కారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ప్రయాణాలు లాభకరంగా ఉంటాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు మెరుగ్గా ఉంటాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు ఉంటాయి. కుటుంబ బాధ్యతల విషయంలో కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధా సక్తులు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఆదాయాన్నిస్తాయి. ప్రయాణాల వల్ల లాభముంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్య భంగం ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో పని భారం బాగా పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయ డంలో కొందరు సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాన్ని సందర్శి స్తారు. అవసరాలకు తగ్గట్టుగా చేతిలో డబ్బు ఉంటుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గు తుంది. ఆహార విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ ముందస్తు జాగ్రత్తలు పాటించడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో ప్రతిభకు, సమర్థతకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలపై మరింతగా శ్రద్ధ పెంచడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు అందుతాయి. అద నపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపో వడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలి స్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారుల నమ్మకంతో పాటు ప్రత్యేక బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు, వివాదాలు సజావుగా సాగిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవు తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవు తుంది.