Horoscope Today: వారు వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Aug 08, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఆగస్టు 8, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడి ఊరట లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారిని ఇంటా బయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగం విషయంలో ఆశించిన మంచి సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారు వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 08th August 2024
Follow us on

దిన ఫలాలు (ఆగస్టు 8, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడి ఊరట లభించే అవకాశం ఉంది.
వృషభ రాశి వారిని ఇంటా బయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగం విషయంలో ఆశించిన మంచి సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ జీవితం యథావిధిగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ఒక పట్టాన ముందుకు సాగక ఇబ్బంది కలిగిస్తాయి. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయానికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఊహించని విధంగా ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడి ఊరట లభించే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంటా బయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఉద్యో గాల్లో స్థాన చలన సూచనలున్నాయి. వ్యాపారాల్లో భాగస్థుల నుంచి అనుకూలతలు పెరుగు తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆదాయ ప్రయత్నాలు సజావుగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు పొందుతారు. పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఆశించిన మంచి సమాచారం అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటుతో వ్యవహరించే అవకాశం ఉంది. కొందరు బంధువులతో మాట పట్టింపులుంటాయి. వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు శ్రమ వల్ల విశ్రాంతి దూరమవుతుంది. మీ వల్ల ఇతరులు ప్రయోజనం పొందడం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు తప్పకుండా చేతికి వస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇష్టమైన బంధుమిత్రుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదం అనుకోకుండా పరిష్కారం అవుతుంది. పాత బాకీలు వసూలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఉంటాయి. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి లోటుండక పోవచ్చు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో శ్రమ తప్పకపోవచ్చు. సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొద్దిగా అసంతృప్తిగా, మంద కొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆశించిన ఆదాయాభివృద్ధికి అవకాశం ఉంది. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబపరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గృహ, వాహనాల కొనుగోలు ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం పెంచుకుంటారు. చేపట్టిన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. కొందరు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. అంచనాలకు తగ్గట్టు ఆదాయం పెరుగుతుంది. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త అందుకుంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపడతారు. దాదాపు ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. నూతన వాహన సౌఖ్యం ఉంది. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవ కాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కుటుంబ సభ్యుల నుంచి కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడ తాయి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆదాయ ప్రయత్నాల్లో వేగం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన సమాధానాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలేవీ ఒక పట్టాన పూర్తి కావు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచన లున్నాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఏమాత్రం ఊహించని శుభవార్త అందుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కొత్త పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసి లబ్ధి పొందు తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మరింత ఆర్థిక పురో గతి సాధిస్తారు. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగు తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఉద్యోగ పరిస్థితులు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయ, ఆరోగ్య పరిస్థితులు చాలావరకు అనుకూ లంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మీద కాస్తంత ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది.