Telugu News Astrology Horoscope today 05th June 2023 Astrological predictions for all zodiac signs in telugu
Horoscope Today: ఉద్యోగపరంగా వారికి శుభవార్త అందుతుంది.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు..
Horoscope Today(5th June 2023): ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి పూర్తి వివరాలతో సోమవారం (జూన్ 5వ తేదీ) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Horoscope Today(5th June 2023): ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి పూర్తి వివరాలతో సోమవారం (జూన్ 5వ తేదీ) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. అటు ఉద్యోగ పరంగా, ఇటు కుటుంబ పరంగా బరువ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించండి. స్నేహితులతో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగ పరంగా శుభవార్త అందుతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనం కలిగించవు. విద్యార్థులకు అన్ని విధాలుగాను బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయంలో మంచి పెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. గృహ, వాహనాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కొన్ని పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరు చదువుల కోసం దూర ప్రాంతానికి వెళ్లే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పర్వాలేదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థికంగా స్థిరత్వం లభించే సూచనలు ఉన్నాయి. పొదుపు సూత్రాలు పాటిస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబపరంగా ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోండి. అపార్ధాల కారణంగా కొందరు బంధువులు దూరమవు తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారు చాలావరకు నిలదొక్కుకుంటారు. విద్యార్థులకు సునాయాసంగా విజయాలు లభిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఐటీ, క్రీడలు, స్వయం ఉపాధి, రియల్ ఎస్టేట్ వంటి రంగాలవారు అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. ఇతరులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు ఎంతో శ్రమ మీద విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు కూడా తీసుకోండి. ఆదాయపరంగా స్థిరత్వం లభిస్తుంది. ఆస్తుల విలువ కొద్దిగా పెరిగినట్టు సమాచారం అందుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. విలాసాల మీద ఖర్చు చేయడం తగ్గించండి. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా మారుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఒక కుటుంబ సమస్య నుంచి అనుకోకుండా బయటపడతారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరానికి విశ్రాంతి అవసరం. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగాల్లో ఉన్నవారికి కొద్దిగా శ్రమ పెరుగుతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి వ్యాపారాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఇతరులకు మాత్రం సహాయం చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అవసరానికి తగ్గట్టుగా ఆర్థిక సహాయం అందుతుంది. అనారోగ్యం మీద ఖర్చులతో ఇబ్బంది పడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సహచరుల నుంచి సహకారం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోకుండా ఒక చిన్న స్థాయి అదృష్ట యోగం పడుతుంది. తోబుట్టువులకు వీలైనంతగా సహాయం చేస్తారు. మీ దగ్గర నుంచి సహాయం పొందిన స్నేహితులు ముఖం చాటేస్తారు. విద్యార్థులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆసాజనకంగా ఉంటాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. ఆదాయంలో పెరుగుదల మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా నడుస్తాయి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)