Horoscope Today: వారికి బంధువుల కారణంగా సమస్యలు జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు..!

| Edited By: Janardhan Veluru

Feb 05, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 5, 2024): మేష రాశి వారు ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి బంధువుల కారణంగా సమస్యలు జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు..!
Horoscope Today 05th February 2024
Follow us on

దిన ఫలాలు (ఫిబ్రవరి 5, 2024): మేష రాశి వారు ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాలు క్రమంగా మరింతగా కలిసి రావడం ప్రారంభిస్తాయి. సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇంటా బయటా సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత బాగా తగ్గుముఖం పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనేక విధాలుగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులకు ఆర్థి కంగా బాగా సహాయ పడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాల్లో తప్ప కుండా సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కాల.క్షేపం చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పు‌ష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులు మీ మీద బాగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అను కూలంగా సాగుతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తలపెట్టిన పనులు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఊహించని శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుకోకుండా కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగు తాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా చక్కబడు తుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. బంధువులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యకలాపాలు పూర్తి చేస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో అనుకూల ఫలితాలనిస్తాయి. ఐ.టి, రియల్ ఎస్టేట్ రంగం లోని వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకా శాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగపరంగా సతీమణికి మంచి అదృష్టం పడుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. సహచరుల నుంచి బాగా పోటీ ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆదాయానికి లోటుండదు. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో సానుకూల ఫలితాలుంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ప్రస్తుతానికి హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం వంటివి చేయవద్దు. ఇంటా బయటా కొత్త బాధ్యతలతో ఇబ్బంది పడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి, వేధింపులు ఉండే అవకాశం ఉంది. అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేసే సూచనలున్నాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాల్లో స్వల్పంగా లాభాలుంటాయి. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి.. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తగ్గు ముఖం పడతాయి. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. కొందరు ప్రము ఖులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడుతాయి. కొన్ని ప్రయత్నాలు సానుకూలపడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలందుతాయి. ఆహార, విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి.