Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు ఇలా..

| Edited By: Janardhan Veluru

Feb 03, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 3, 2024): మేష రాశి వారికి శనివారంనాడు వృత్తి, ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు ఇలా..
Horoscope Today 03th February 2024
Follow us on

దిన ఫలాలు (ఫిబ్రవరి 3, 2024): మేష రాశి వారికి శనివారంనాడు వృత్తి, ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు, కుటుంబ వ్యవహారాల్లో మధ్య మధ్య చిరాకులు తప్పక పోవచ్చు. ఆదాయపరంగా, ఉద్యోగపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగావ కాశాలు కలిసి వస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వ్యాపారాలు లాభి స్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అనుకోకుండా కొన్ని మంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ఏ విష యంలో ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి అడుగువేయడం మంచిది. పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగంలో త్వరితగతిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు కూడా లాభాల బాట పడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక అవసరాలు చాలా వరకు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవా లేదనిపిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. కుటుంబ సమస్యలు నిదానంగా పరిష్కారం అవుతాయి. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. సతీమణితో ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు లాభాలను తీసుకువస్తాయి. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువులతో సామరస్య ధోరణితో వ్యవహరించడం మంచిది. ఏ విషయంలోనూ తొందరపాటు వైఖరి పనికి రాదు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తాయి. మంచి పెళ్లి సంబంధం ఖాయమవుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. పిల్లల నుంచి, బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాం తంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలలో అధికారులు ఎక్కువగా మీపై ఆధారపడడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశిం చిన స్థాయిలో లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలోనే మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభ వార్తలు అందు తాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. వ్యాపారాల్లో లాభా లకు లోటు ఉండదు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు ఎదురుండదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధికారుల నుంచి బాగానే ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపో తాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. దూరపు బంధువుల నుంచి సానుకూల సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుకుంటారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి సానుకూలపడుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. సామాజికంగా కూడా ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. చిన్న నాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ఒక శుభ కార్యంలో బంధువులకు ఆర్థికంగా సహాయపడతారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా పట్టుదలగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రస్తుతానికి దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు. పిల్లలు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవా లేదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొత్తగా ఇల్లు కొనడం మీద దృష్టి పెడతారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆర్థిక లావా దేవీలు, స్పెక్యులేషన్ ల వల్ల ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలావరకు సామరస్యంగా సాగిపోతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.