Gajkesri Rajyoga: బృహస్పతి, చంద్రుని కలయికతో ఏర్పడిన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

|

Jan 11, 2025 | 7:25 PM

జ్యోతిష్యశాస్త్రంలో రాశులు, గ్రహాలకు ప్రముఖ స్థానం ఉంది. కొన్ని గ్రహాల కలయికతో కొన్ని యోగాలు ఏర్పడతాయి. బృహస్పతి, చంద్రుని కలయికతో ఏర్పడిన గజ కేశరి యోగం చాలా రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ యోగావలన కొన్ని రాశులకు చెందిన వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంపద, విజయం కలుగుతాయి. ఈ రోజు ఏ రాశుల వారికి ఈ యోగం మేలు చేస్తుందో తెలుసుకుందాం.

Gajkesri Rajyoga: బృహస్పతి, చంద్రుని కలయికతో ఏర్పడిన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
Gajkesri Rajyoga 2025
Follow us on

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహంగా పరిగణించబడ్డాడు. చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాశిని మార్చుకుంటాడు. అందుకనే చంద్రుడు మరొక గ్రహంతో ఎక్కువగా కలిసి ఉండటానికి ఇదే కారణం. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాలతో చంద్రుని కలయిక చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జనవరి 9వ తేదీ రాత్రి 8.46 గంటలకు చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశులకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది.

బృహస్పతి, చంద్రుడు కలయిక గజకేసరి రాజయోగం

బృహస్పతి ఇప్పటికే వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ఈ రాశిలోకి ప్రవేశించిన తరువాత.. బృహస్పతి, చంద్రుని కలయిక ఏర్పడింది. రెండు గ్రహాలు కలిసి గజకేసరి రాజయోగాన్ని ఏర్పరిచాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశుల వారు ఈ గజకేసరి రాజయోగం వల్ల ఏదో ఒక విధంగా ప్రభావితమవుతారు. అయితే ఈ గజకేసరి రాజయోగం మూడు రాశులకు లక్కిని తీసుకుని వచ్చింది. ఈ రోజు ఆ 3 అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి: బృహస్పతి, చంద్రుడు కలయిక వృషభ రాశిలో కలిసి.. లగ్నమైన గృహంలో గజకేసరి రాజయోగాన్ని ఏర్పరిచాయి. దీంతో వృషభ రాశి వ్యక్తులు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఈ సమయం ఉద్యోగస్తులకు చాలా మంచిది. కెరీర్‌లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి.

ధనుస్సు రాశి: ఈ రాశిలో బృహస్పతి, చంద్రుడు ఆరవ ఇంట్లో కలయికను ఏర్పరిచింది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభం ఉండవచ్చు. పూర్వీకుల ఆస్తిలో కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యోగంపై పూర్తిగా దృష్టి పెట్టవచ్చు. వ్యాపారం కోసం రూపొందించిన అన్ని వ్యూహాల నుంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది.

కుంభ రాశి: గజకేసరి రాజయోగం కుంభ రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభ రాశికి చెందిన వ్యక్తులు అదృష్టం కలిసి వస్తుంది. పూర్తి మద్దతును పొందుతారు. కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు లాభపడవచ్చు. వ్యాపారస్తులు ఆర్థికంగా లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి.

గజకేసరి రాజయోగం అంటే ఏమిటి?

జ్యోతిషశాస్త్రంలో గజకేసరి యోగాన్ని చాలా పవిత్రమైన యోగాగా పరిగణిస్తారు. బృహస్పతి, చంద్రుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. బృహస్పతి జ్ఞానం, సంపద, జ్ఞానం కారకంగా పరిగణించబడుతుంది. అయితే చంద్రుడు మనస్సు, భావోద్వేగాలకు కారకుడు. ఈ రెండు గ్రహాల కలయిక వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.