AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 6 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో అదృష్టం.. మీ రాశికి ఇలా..?

Horoscope Today (September 6, 2026): ఆదివారం మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేష రాశి వారికి ఉద్యోగ, వృత్తి జీవితం అనుకూలంగా ఉండటంతో పాటు వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి వ్యాపార లాభాలు నిలకడగా సాగుతాయి, నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. మిథున రాశి వారు ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తిస్తారు, ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయాన్ని అందుకుంటారు. మిగిలిన రాశుల వారి ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

సెప్టెంబర్ 6 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో అదృష్టం.. మీ రాశికి ఇలా..?
Horoscope Today 06 Sep 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 06, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (సెప్టెంబర్ 6, 2026): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. మిథున రాశి వారు ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొద్దిపాటి శ్రమ, తిప్పటలతో ముఖ్యమైన పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక విష యాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు సమసిపొతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించినంతగా పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. కెరీర్ పరంగా జీవిత భాగస్వామి కూడా పురోగతి చెందుతారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సమాజంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచ యాలు పెరుగుతాయి. అనుకోకుండా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు మరింతగా మెరుగుపడతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ఊహించని విధంగా కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ వ్యక్తిగతంగా తప్పకుండా పురోగతి ఉంటుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విదే శాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాలు నిలకడగా పురోగ మిస్తాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆశించిన శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రాశివారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కూడా మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఏ ప్రయత్నం అయినా సానుకూల ఫలితాలనిస్తుంది. ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమ స్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు ఉపయోగపడతాయి. కుటుంబ వ్యవహారాలు క్రమంగా చక్కబడడం ప్రారంభిస్తాయి. ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక, వ్యక్తిగత సమ స్యలు తగ్గుముఖం పడతాయి. పిల్లల చదువుల విషయంలో ఆశించిన శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు మెరుగుపడడంతో పాటు, ఉద్యోగం మారే అవకాశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కనిపిస్తాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కొందరు స్నేహితుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

కొద్ది శ్రమతో కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. కొద్దిగా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయ త్నంతో చేతికి అందుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబానికి సంబంధించి తప్పకుండా శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్త వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఆదాయం బాగానే ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లోనూ, సామాజిక సేవల్లోనూ పాల్గొంటారు.

Also Read: ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు

Follow Us