అక్టోబర్ 20 రాశి ఫలాలు: వారికి ఆదాయ యోగం, ఉద్యోగంలో కొత్త బాధ్యతలు..!
Horoscope Today (October 20, 2026): మంగళవారం గ్రహాల సంచారం 12 రాశుల వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? కొన్ని రాశుల వారికి ఆదాయ వృద్ధి, ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార లాభాలు కలిసి రానుండగా.. మరికొందరికి ఎలాంటి ఫలితాలు ఎదురుకానున్నాయి? మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి.

దిన ఫలాలు (అక్టోబర్ 20, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి ఆదాయంలో ఊహించని పెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని పట్టు దలగా చక్కబెడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు, పలుకుబడి పెరుగుతాయి. మంచి స్నేహితులు ఏర్పడతారు. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రోజంతా ప్రశాంతంగా, హాయిగా గడిచిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. రావలసిన డబ్బు అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో సరదాగా కాల క్షేపం చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయంలో ఊహించని పెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని పట్టుదలగా చక్కబెడతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించడం గానీ, ఇంక్రిమెంట్ పెరగడం గానీ జరుగు తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అంచనాలకు మించి డిమాండ్, సంపాదన పెరు గుతాయి. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా ప్రోత్సాహకరంగా పురోగ మిస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చుల్ని అదుపు చేయడం కష్టమవుతుంది. తల్లి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. సామాజికంగా గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటుండదు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తవచ్చు. వ్యాపారంలో శ్రమాధిక్యత ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. జీవిత భాగస్వామితో సామరస్యం, అన్యోన్యత పెరుగుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో మీ పనితీరుతో అందరికీ ఆకట్టుకుంటారు. వృత్తి రంగంలో మీరనుకున్నది సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆర్థికంగా ఊహించని అదృష్టం పడుతుంది. ఆదాయ వృద్దికి ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. రాజకీయాల్లో ప్రవేశించేవారికి సమయం అను కూలంగా ఉంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఉద్యోగపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సాను కూల పడతాయి. పిల్లల చదువుల విషయంలో కొద్దిగా సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక లావాదేవీలకు సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఉన్నతస్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగంలో అధికారులకు మీ సలహాలు బాగా నచ్చుతాయి. వృత్తి రంగంలో మంచి గుర్తింపు లభించి రాబడి పెరుగుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. ఆరోగ్యం బాగుంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రోజంతా చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. పలుకుబడి కలి గిన వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి యాక్టివిటీ బాగా పెరుగుతుంది. జీవిత భాగస్వామి తరఫు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. వ్యాపారంలో కొన్ని దీర్ఘకాలిక లావాదేవీలు అనుకూలంగా మారతాయి. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశాలలో స్థిరపడిన పిల్లల నుంచి శుభ వార్తలు అందుకుంటారు. శ్రమ, తిప్పట ఉన్నప్పటికీ, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. దైవ కార్యాలు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమ స్యలు చాలావరకు తగ్గిపోతాయి. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాల విషయంలో అధి కారుల నుంచి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో పెద్దల సలహాలు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది.



