నవంబర్ 10 రాశిఫలాలు: వారికి ఆదాయం డబుల్.. ఉద్యోగాల్లో కీలక మార్పులు!

Horoscope Today (November 10, 2026): మంగళవారం రోజున గ్రహాల సంచారం 12 రాశుల వారిపై ప్రభావం చూపనుంది. కొందరికి ఆదాయం పెరిగే సూచనలు ఉండగా, మరికొందరికి ఉద్యోగ, వ్యాపారాల్లో కీలక మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం, వృత్తి, ఉద్యోగ పరంగా ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? మీ రాశి ఫలితం తెలుసుకోండి.

నవంబర్ 10 రాశిఫలాలు: వారికి ఆదాయం డబుల్.. ఉద్యోగాల్లో కీలక మార్పులు!
Rasi Phalalu 10 Nov 2026

Edited By:

Updated on: Nov 10, 2026 | 6:00 AM

దిన ఫలాలు (నవంబర్ 10, 2026): మేష రాశి వారు ఆస్తి, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయంలో అంచనాల్ని మించిన వృద్ధి ఉంటుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆస్తి, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయంలో అంచనాల్ని మించిన వృద్ధి ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. బంధువుల సాయంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. చేపట్టిన పనులు, ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. చిన్నా చితకా వ్యక్తిగత, ఆర్థిక సమస్యల్ని అధిగమిస్తారు. వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల్లో లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్త వుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుం టాయి. విదేశాల్లో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు బాగా రాణి స్తారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితంలో అధికారులు మీ సలహాలు, సూచనలతో లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశముంది. కుటుంబ సభ్యు లతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పని భారంతో అవస్థలు పడతారు. జీవిత భాగ స్వామికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. రావ లసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో కొత్త బాధ్యతలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురో గమిస్తాయి. చేపట్టిన పనులన్నిటినీ వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో కాల క్షేపం చేయడం జరుగుతుంది. దైవ కార్యాల్లో కూడా పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటు ఉండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సమేతంగా ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ప్రధాన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు సన్నిహితులతో అపార్థాలు తలెత్తుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగు తాయి. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో శుభ కార్యంలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. సర్వత్రా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచ యాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. ఆర్థిక సహాయం విషయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రుల వల్ల నష్టాలకు గురవుతారు. కుటుంబపరంగా కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్త వుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు, చేర్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యో గుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సర్వత్రా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకో వద్దు. సొంత పనులు మీద శ్రద్ద అవసరం. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవా లేదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఇంటా బయటా పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబం ధం కుదురుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us