Horoscope Today: ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో మార్చి 30 మంగళవారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!
మేష రాశి:
ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. క్రమశిక్షణ తప్పకూడదు. ఈ రాశివారికి శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
వృషభ రాశి:
ఈ రాశివారికీ ప్రముఖుల నుంచి మనషి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారికి విశేషంగా అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
మిధున రాశి:
ఈరాశివారికి ఈరోజు ఆర్ధిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రయాణాల విషయంలో తొందర పడకూడదు. నందీశ్వరుడి దర్శనం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి:
ఈ రాశివారికి ఈరోజు నూతనపరిచయాలుంటాయి. సంఘంలో కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. లక్ష్మీనరసింహ స్వామీ దర్శనం మేలు చేస్తుంది.
సింహ రాశి:
ఈరోజు చేపట్టినటువంటి పనులు కొంత ఆలస్యం అవుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కన్య రాశి:
ఈ రాశివారు ఈరోజు ఆర్ధిక పరిస్థితులు నెమ్మదినెమ్మదిగా మెరుగవుతుంటాయి.జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. లలితాసహస్రనామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
తులా రాశి:
ఈ రాశివారికి స్థిరాస్తి వివాదాలు కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. . వీరు లలితాసహస్రనామ స్తోత్ర పారాయణం మేలును పొందవచ్చు.
వృశ్చిక రాశి:
ఈరోజు నిర్ణయాలు తీసుకునే సమయంలో ఏ మాత్రం కూడా తొందరపడకూడదు. మంచిచెడులు గురించి ఆలోచనచేయడం మంచిది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలితాలను కలుగజేస్తుంది.
ధనుస్సు రాశి:
ఈరోజు ఈ రాశివారికి రావాల్సిన బాకీలు కొంత ఆలస్యమవుతుంటాయి. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సాయంవేళలో మహాలక్ష్మి దర్శనం మేలు చేస్తుంది.
మకర రాశి:
ఈ రాశి వారికి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రీరమ రక్షా స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కుంభ రాశి:
ఈరాశి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కోర్టు సంబంధమైనటువంటి ఒక కొలిక్కి వచ్చేటటువంటి సూచన కల్పిస్తుంది. సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవడం మంచింది.
మీన రాశి:
ఈ రాశివారు ఈరోజు చేపట్టినటువంటి పనుల్లో ఇతరుల యొక్క సహకారం అవసరమవుతుంది. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విశేషంగా శివపంచాక్షరీ జపం, విష్ణు మూర్తి దర్శనం మేలు చేస్తుంది.