
దిన ఫలాలు (నవంబర్ 15, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో సమర్థతకు, పనితీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి లభిస్తుంది. ధనపరంగా వాగ్దానాలు చేయవద్దు.
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు, సహోద్యోగుల్ని పనితీరుతో ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.
ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా లాభదాయకంగా పురోగమిస్తాయి. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. మిత్రులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది కానీ, ముఖ్యమైన ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు.
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, కుటుంబ ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది తప్పకపోవచ్చు. ఇష్టమైన వ్యక్తులతో విందులు, వినోదాలతో సరదాగా గడుపుతారు. పిల్లల విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. ఆర్థిక ఒత్తిడి నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనుల్ని, వ్యవహారాల్ని తేలి కగా పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగం మారే ప్రయత్నాలు సక్సెస్ కాకపోవచ్చు. కుటుంబ జీవితం బాగాహ్యాపీగా సాగిపోతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి పోతాయి. మొండి బాకీలు, బకాయిలు వసూలవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందు తాయి. ఆర్థిక ప్రయత్నాలు పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలనిస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరగడం, మంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు బాగా పురోగతి సాధిస్తారు.
రోజంతా సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా పురోగమిస్తుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రతి విషయంలోనూ సానుకూల దృక్పథంతో వ్యవహ రించడం అవసరం. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల చదువుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ఆదరణ లభిస్తుంది.
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. మీ సల హాలు, సూచనలకు విలువ ఏర్పడుతుంది. జీవిత భాగస్వామికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఇష్టమైన బంధుమిత్రులతో విందు వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగుతాయి.
ఆర్థికాభివృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. వివిధ మార్గాల్లో ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పురోగమిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశ మనం లభిస్తుంది. కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన బాగాపెరుగుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కీలక విష యాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. దాంపత్య జీవితం చాలావరకు ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబసమేతంగా ఆలయాలను సందర్శిస్తారు.
ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉప యోగించుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రుల వల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఆశించిన విధంగా సత్ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.
వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు భారీగా సహాయం చేయడం జరుగుతుంది. కొందరు మిత్రుల వల్ల ఇరకాట పరిస్థితులు తలెత్తవచ్చు. సోదరులతో అపార్థాలు తొలగుతాయి.