
దిన ఫలాలు (ఆగస్టు 5, 2026): మేష రాశి వారు ఆర్థిక విషయాల్లో తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వృషభ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులుంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతున్నా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలతలు తప్పకపోవచ్చు. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక విషయాల్లో తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో జీవిత భాగస్వామి సాయం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫ లితాలనిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
ఆదాయానికి లోటుండదు. ఆర్థికంగా అనుకూల పరిస్థితులుంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. బంధువుల సహకారంతో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
అష్టమ రాహువు ప్రభావం కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఆలస్యంగా పూర్తవుతాయి. ఇంటా బయటా కొన్ని ప్రతికూలతలుంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కూడా అదనపు బాధ్యతలు మీద పడే పెరిగే అవకాశం ఉంది. ఆదాయం కలిసి వస్తుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆర్థికంగా పరవాలేదనిపిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం బాగా అనుకూలంగా సాగుతుంది.
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితంలోని వారికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. నిరుద్యోగులకు కాలం కలిసి వస్తుంది. విదేశాల నుంచి ఆశిం చిన సమాచారం అందుతుంది. విదేశీయానానికి, విదేశాల్లో స్థిరపడడానికి అవకాశాలు మెరుగుప డతాయి. అనుకోకుండా మంచి ధన యోగం పడుతుంది. సేవా కార్యక్రమాల్లోనూ, సహాయ కార్య క్రమాల్లోనూ పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవి తంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. అద నపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. అనారోగ్య సమస్యలుండే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
ఉద్యోగంలో అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా మారు తాయి. కుటుంబానికి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆదాయం పెంచుకోవడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొన్నిఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమి స్తాయి. కుటుంబ సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఒకరిద్దరు బంధువులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆదాయం స్థిరంగా కొనసాగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులకు దూరప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. అధికార బాధ్యతలు పంచు కునే అవకాశముంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది.ఆదాయానికి, ఆరో గ్యా నికి ఇబ్బంది ఉండదు. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. విదేశాల్లో స్థిరప డిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మిత్రుల వల్ల ఇబ్బందులు ఉంటాయి.
ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులకు బాగా ఉపయోగ పడతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగి పోతాయి. ఆస్తి వ్యవహారాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
ఉద్యోగ జీవితం పరవాలేదనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ప్రతి వ్యవహారం లోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. కొన్ని పనులు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. ఆదా యం వృద్ధి చెందుతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. మిత్రులకు ఆర్థికంగా సహాయంచేస్తారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.