Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope in Telugu: ఫిబ్రవరి 19, 2026 గురువారం దినఫలాల ప్రకారం మేష రాశి వారికి జీతభత్యాలు, ఆదాయానికి సంబంధించిన శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా మెరుగుపడుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. మిథున రాశి వారు చేపట్టే ఆర్థిక ప్రయత్నాలు ఫలించి, ఆకస్మిక ధనలాభం కూడా కలగవచ్చు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఫలితాలు ప్రధానంగా అనుకూలంగా ఉండనున్నాయి.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 19 Feb 2026

Edited By:

Updated on: Feb 19, 2026 | 5:31 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 19, 2026): మేష రాశి వారు ఈ రోజు జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశముంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులుంటాయి. వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువగా కలిసి వస్తాయి. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయిలన్నీ వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. కొందరు మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలనన్నిటినీ పూర్తి చేయడం జరుగుతుంది. జీవిత భాగస్వామికి సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొందరు బంధువుల వల్ల ఇబ్బంది పడతారు. సామాజికంగా అనుకోని గుర్తింపు లభిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధు మిత్రులకు అండగా నిలబడడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ఆశించిన విధంగా పదోన్నతి లభించవచ్చు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపో తాయి. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కొన్ని ఆర్థిక ప్రయత్నాలు సానుకూలపడతాయి. వివాహ సంబంధం నిశ్చయం అవుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత మరింతగా పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విదేశాల నుంచి మంచి శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపా రాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబపరంగా అభివృద్ధి ఉంటుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడు తుంది. మిత్రులు, సహచరుల వల్ల ఇబ్బందులుండవచ్చు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వ్యక్తిగత సమస్యల విషయంలో సహనంతో వ్యవహరిం చడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిళ్లు, వేధింపులుంటాయి. వృత్తి జీవితంలో తీరిక లభించకపోవచ్చు. వ్యాపా రాలు నిలకడగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు, హామీలు ఉండవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలందిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల వాతావరణం కాస్తంత ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు.

Follow Us