ఆగస్టు 24 రాశిఫలాలు: ఈ రోజు వీరికి పట్టిందల్లా బంగారమే.. మరి మీ రాశి ఎలా ఉందంటే?

ఆగస్టు 24, 2026 దిన ఫలాల్లో మేషం, మిథునం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, మీనం రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. కొందరికి ఆదాయం పెరుగుతుంది, కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే కర్కాటకం, కన్య, సింహం, మకరం రాశుల వారు కుటుంబ, ఆరోగ్య, ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ఆగస్టు 24 రాశిఫలాలు: ఈ రోజు వీరికి పట్టిందల్లా బంగారమే.. మరి మీ రాశి ఎలా ఉందంటే?
August 24, 2026 Horoscope

Edited By:

Updated on: Aug 24, 2026 | 6:23 AM

దిన ఫలాలు(ఆగస్టు 24, 2026): మేష రాశి వారికి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. మిథున రాశి వారు ఏ రంగానికి చెందినవారైనా బాగా పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సింహ రాశిలో బుధాదిత్య యోగం పట్టడంతోపాటు, లాభ స్థానంలో కుజుడి సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి లబ్ధి పొందడం జరుగుతుంది. మరి మిగతా రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయో పూర్తిగా తెలుసుకుందాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా మారుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. ఉద్యోగావకాశాలు బాగా మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రాశ్యధిపతి శుక్రుడు, దశమ స్థానాధిపతి శని బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండడంతో పాటు, వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వ్యాపా రాల్లో కూడా ఆశించిన లాభాలు చవి చూస్తారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గురు, శని, బుధ, రవులు అనుకూలంగా ఉండడం వల్ల సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తి స్థాయి లభిస్తుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఏ రంగానికి చెందినవారైనా బాగా పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపా రాల్లో దూసుకుపోతారు. విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

రవి, బుధ, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. స్వల్ప అనారోగ్యానికి అవ కాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ధనపరంగా వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఈ రాశిలో బుధాదిత్య యోగం పట్టడంతోపాటు, లాభ స్థానంలో కుజుడి సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి లబ్ధి పొందడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రాశినాథుడైన బుధుడు సింహ రాశిలో ఉండడం, గురువు లాభ స్థానంలో, శుక్రుడు ధన స్థానంలో పంచమ స్థానంలో ఉండడం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. ఆర్థిక విష యాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించిపోతుంది. సప్తమ శని కారణంగా ఇంటా బయటా ఒత్తిడి ఉండడం, శుభ కార్యాల మీద బాగా ఖర్చు కావడం జరు గుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. జీవిత భాగస్వామితో వాదనలకు దిగవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

శనీశ్వరుడితో పాటు గురు, బుధ శుభ గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ కార్యం తలపెట్టినా అనుకూలంగా సాగిపోతుంది. సరైన విధంగా ప్రయత్నిస్తే శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయంలో ఊహించని పెరుగుదల ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవడం జరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

గురు, బుధ, శుక్ర, రవులతో పాటు శనీశ్వరుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఇంటా బయటా ఏ పని తలపెట్టినా అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యో గంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు మంచి విదేశీ ఆఫర్ అందుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రవి, బుధ గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యవహార జయం ఉంటుంది. రావాల్సిన డబ్బు వసూలవుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదా యం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యతలు తగ్గుముఖం పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

తృతీయంలో శని, సప్తమంలో గురువు, భాగ్య స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ది పొందు తారు. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలున్నా పట్టుదలగా ఆస్తి సంబంధమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా బాగా జాగ్రత్తపడాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రవి, బుధ, కుజ గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సరికొత్త ఆలోచనలను, వ్యూహాలను ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. అష్టమ స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆశించిన శుభవార్త వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

పంచమ స్థానంలో రాశ్యధిపతి గురువు ఉచ్ఛ పట్టడం వల్ల ఆడింది ఆటగా పాడింది పాటగా సాగి పోతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉండడం, అవసరానికి డబ్బు అందడం, రావాల్సిన డబ్బును వసూలు చేసుకోవడం, ఆర్థిక సమస్యలు తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమ స్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్ని సకా లంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us