AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు 19 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు..12 రాశుల వారికి ఇలా..

Horoscope Today (August 19, 2026): మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేష రాశి నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉండగా.. వృషభ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అందుతాయి. మిథున రాశి వారికి శుభవార్తలు, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మరి మిగతా రాశుల వారికి ఈ రోజు ఎలా ఉందో చూద్దాం.

ఆగస్టు 19 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు..12 రాశుల వారికి ఇలా..
Rashifal 19 August 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 19, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (ఆగస్టు 19, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అంది వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా, సంతృప్తికరంగా పురోగమిస్తాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మేషం మొదలు మీనం వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయంబాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. జీవిత భాగ స్వామితో మిత్రుల శుభ కార్యంలో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అంది వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా, సంతృప్తికరంగా పురోగమిస్తాయి. కుటుంబంతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. ఆర్థికపరంగా అనుకూల వాతా వరణం నెలకొని ఉంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శత్రు సంబంధమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

శ్రమ, తిప్పట ఎక్కువగా ఉన్నప్పటికీ అనుకున్న పనులు, వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవు తాయి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరిం చాల్సి ఉంటుంది. బంధువులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొందరు మిత్రుల తీరువల్ల బాగా ఇబ్బంది పడతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కూడా ఉంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధుమిత్రులతో సామరస్యం నెలకొంటుంది. కుటుంబంలో అన్యోన్య వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ప్రస్తుతం అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, ఆలోచనలను కార్యరూపంలో పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కొన్ని మంచి అవకా శాలు అందివస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలను మరింతగా సద్విని యోగం చేసుకోవడం మంచిది. కొత్త పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సాయపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఒక శుభకార్యంలో బంధువుల్ని కలుస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగాల్లో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. కీలక విషయాల్లో సరైన నిర్ణయాలు తీసు కుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల వల్ల కొద్దిగా ఇబ్బందులకు గురవు తారు. సొంత వ్యవహారాల మీద వీలైనంతగా దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగి స్తాయి. ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మరింతగా పురోగతి సాధిస్తారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో బంధువుల సాయం లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యం వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ వీలై నంత జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభి స్తుంది. కుటుంబ సమస్యలు బాగా తగ్గుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. శుభ కార్యం తలపెడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విందు వినోదాల మీద ఖర్చు బాగా ఎక్కువవుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజ నీర్లు తదితర వృత్తుల వారికి ఒక పట్టాన తీరిక దొరకదు. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు వసూలవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహ రించడం మంచిది. ముఖ్యమైన వ్యవ హారాలు నత్తనడక నడుస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

కుంభం (ధనిష‌్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగు లకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితం చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా, సానుకూలంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరు గుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులలో ఒకరికి స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. స్తోమతకు మించి మిత్రులకు సహాయపడతారు. జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Follow Us
చాట్ తెరవకుండానే ఫోటోలు, వీడియోలు చూడవచ్చు.. కొత్త ఫీచర్..!
చాట్ తెరవకుండానే ఫోటోలు, వీడియోలు చూడవచ్చు.. కొత్త ఫీచర్..!
పాత బంగారం అమ్మేటప్పుడు కొన్న ధర కంటే తక్కువ ఎందుకు వస్తుంది?
పాత బంగారం అమ్మేటప్పుడు కొన్న ధర కంటే తక్కువ ఎందుకు వస్తుంది?
ఆగస్టు 19 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు..
ఆగస్టు 19 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు..
రతన్ టాటా లేదా నోయెల్ టాటా కాదు..టాటా గ్రూప్‌కు అసలు యజమాని ఎవరు?
రతన్ టాటా లేదా నోయెల్ టాటా కాదు..టాటా గ్రూప్‌కు అసలు యజమాని ఎవరు?
భర్తతో కలిసి హైదరాబాద్ జూను సందర్శించిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోస్
భర్తతో కలిసి హైదరాబాద్ జూను సందర్శించిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోస్
NTA పక్షాళన.. 600 మంది నిపుణుల తొలగింపు..CISF భద్రతలో కొత్త ఆఫీస్
NTA పక్షాళన.. 600 మంది నిపుణుల తొలగింపు..CISF భద్రతలో కొత్త ఆఫీస్
యశ్ 'టాక్సిక్' మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
యశ్ 'టాక్సిక్' మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
ఇన్నాళ్ళు ఈ ఎనర్జిటిక్ పచ్చడి ఎలా మిస్సయ్యారండి..
ఇన్నాళ్ళు ఈ ఎనర్జిటిక్ పచ్చడి ఎలా మిస్సయ్యారండి..
జనాభా అసమతుల్యత.. యువతలో డ్రగ్స్‌ కట్టడిపై ఆర్ఎస్ఎస్ కీలక చర్చలు
జనాభా అసమతుల్యత.. యువతలో డ్రగ్స్‌ కట్టడిపై ఆర్ఎస్ఎస్ కీలక చర్చలు
గ్యాస్‌తో పనేలేకుండా 5 నిమిషాల్లో చేసుకునే కమ్మని ఉల్లిపాయ పచ్చడి
గ్యాస్‌తో పనేలేకుండా 5 నిమిషాల్లో చేసుకునే కమ్మని ఉల్లిపాయ పచ్చడి