Horoscope Today 16th April: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అప్పుడు ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ రోజు ఏప్రిల్ 16 శుక్రవారం రోజున ఏ రాశివారికి ఏ విధమైన ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.
మేష రాశి :
ఈ రాశి వారికి ఈ రోజు వేరు వేరు రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చన మేలు చేస్తుంది.
వృషభరాశి:
ఈ రాశి వారికి నూతన ఉద్యోగ లాభాలు కలిసివస్తాయి.. మర్యాదలు కోల్పోకుండా వ్యవహరిస్తుండాలి. లలితా అమ్మవారి నామస్మరణ మేలు చేస్తుంది.
మిథున రాశి:
ఈ రాశి వారికి ఈ రోజు శ్రమ ఫలిస్తుంది. క్రయవిక్రయాల్లో లాభాలు కలిసివస్తాయి. శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి:
ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఇష్టవస్తు ప్రాప్తి లభిస్తుంది. ఆంజనేయస్వామికి తమలపాకులతో అర్చన మేలు చేస్తుంది.
సింహ రాశి:
ఈ రాశివారు వ్యాపార వ్యావహారిక విషయాల్లో అభివృద్ధికి సంబంధించినటు వంటి నిర్ణయాలు తీసుకుంటూవుంటారు. సామజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరీ అమ్మవారికి పసుపుకుంకుమలు సమర్పించడం మంచిది.
కన్యా రాశి :
ఈ రాశివారు ఈ రోజు సంఘంలో గౌరవాలు ఏర్పడతాయి. పెట్టుబడుల విషయాల్లో పెద్దవారి ఆలోచనలు గౌరవించడం మంచిది. శ్రీవెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవలో.. లేదా సుప్రభాత స్త్రోత్ర పారాయణం మంచిది.
తుల రాశి:
ఈ రాశి వారు ఈ రోజు ఆర్ధిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించే ఆలోచన చేయాలి. అష్టలక్ష్మి స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపారాత్మకమైన విషయాల్లో మిశ్రమైన ఫలితాలు ఏర్పడతాయి.
గణపతికి అర్చన నిర్వహించడం మంచిది.
ధనస్సు రాశి:
ఈ రాశి వారు చర్చలు ఫలిస్తాయి. ఆర్ధిక విషయాల్లో లాభాల బాట పడతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
మకర రాశి:
ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబం పరమైన పలు కార్యక్రమాలు చేపడుతుంటారు. పలు రకాల విందు వినోదమైన కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శివపంచాక్షరీ మంత్రం మేలు చేస్తుంది.
కుంభ రాశి:
ఈ రాశి ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సామజిక గౌరవాలు కోల్పోకుండా ఉండాలి. దుర్గ సప్త శ్లోకీ పారాయణం మేలు చేస్తుంది.
మీన రాశి:
ఈ రాశి వారు ఈ రోజు అనారోగ్య సంబంధిత విషయాల్లో అలక్ష్యం చేయరాదు. డాక్టర్లను సంప్రదించడం మంచిది. ఆదిత్య హృదయ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
Also Read: నరుడుగా పుట్టి.. దైవంగా పూజలందుకుంటున్న శ్రీరాముడి గుణాలు ఏమిటంటే..!