Budh Vakri 2024: వక్ర బుధుడితో ఆ రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ సమస్యల నుంచి విముక్తి..!

ప్రస్తుతం సింహ రాశిలో సంచారం చేస్తున్న బుధ గ్రహం ఆగస్టు 5వ తేదీ నుంచి 22 వరకు వక్రించడం జరుగుతుంది. మిత్ర క్షేత్రమైన సింహ రాశిలో బుధుడు వక్రించడం వల్ల కొన్ని రాశుల వారికి తప్పకుండా వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, ఉద్యోగపరమైన సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. వక్రించిన గ్రహం తాను పూర్తి చేయవలసిన పనులను మరింత వేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది.

Budh Vakri 2024: వక్ర బుధుడితో ఆ రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ సమస్యల నుంచి విముక్తి..!
Budh Vakri 2024

Edited By:

Updated on: Jul 31, 2024 | 11:56 AM

ప్రస్తుతం సింహ రాశిలో సంచారం చేస్తున్న బుధ గ్రహం ఆగస్టు 5వ తేదీ నుంచి 22 వరకు వక్రించడం జరుగుతుంది. మిత్ర క్షేత్రమైన సింహ రాశిలో బుధుడు వక్రించడం వల్ల కొన్ని రాశుల వారికి తప్పకుండా వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, ఉద్యోగపరమైన సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. వక్రించిన గ్రహం తాను పూర్తి చేయవలసిన పనులను మరింత వేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. వక్రించిన గ్రహానికి చేష్టాబలం పడుతుంది. బుధుడి వక్రగతి వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, ధనూ రాశుల వారు అత్యధికంగా ప్రయోజనం పొందుతారు.

  1. మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడు వక్రగతి పడుతున్నందువల్ల ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి, కొన్ని ఇబ్బందికర పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. జీతభత్యాల పెరుగుదల, పదోన్నతులకు సంబంధించి శుభవార్తలు వింటారు. కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
  2. వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు చతుర్థ స్థానంలో వక్రిస్తున్నందువల్ల, కెరీర్ పరంగా ఉన్నత స్థానాలకు చేరుకోవడం, స్థిరత్వం లభించడం వంటివి జరుగుతాయి. ఉద్యోగపరంగానే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో బుధుడు వక్రించడం వల్ల రావలసిన డబ్బు అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. కుటుంబంలో పెండిం గులో ఉండిపోయిన శుభకార్యాలు ఇప్పుడు జరగడానికి అవకాశముంది. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.
  4. సింహం: ఈ రాశిలో బుధుడి వక్రగతి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. సమా జంలో గౌరవమర్యాదలు పెంపొందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా కూడా ఆఫర్లు అందుతాయి. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  5. తుల: ఈ రాశికి లాభ స్థానంలో బుధుడు వక్రగతిలో సంచారం చేయడం అనేక విశేష ఫలితాలనిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి.
  6. ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధుడు వక్రించడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కీలకమైన విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి ఒప్పందాలు, వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆపర్లు కూడా అందుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

Loading...
Unable to load recommendations.
Follow Us