August Horoscope: ఆగస్టు నెలలో ఆ రాశుల వారికి అందలాలు, ఆదాయాలు.. వారికి అన్ని శుభాలే..

| Edited By: Janardhan Veluru

Jul 30, 2024 | 7:03 PM

ఆగస్టు నెలలో నాలుగు గ్రహాలు రాశి మార్పు చెందుతున్నాయి. శుక్ర, బుధ, రవి, కుజుల రాశి మార్పు వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు ఆదాయపరంగా, అధికారపరంగా బాగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇందులో శుక్ర, బుధుల కదలికల వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉండగా, రవి, కుజుల రాశి మార్పు వల్ల కెరీర్ పరంగా అందలాలు ఎక్కే అవకాశం ఉంది.

August Horoscope: ఆగస్టు నెలలో ఆ రాశుల వారికి అందలాలు, ఆదాయాలు.. వారికి అన్ని శుభాలే..
August Horoscope
Follow us on

ఆగస్టు నెలలో నాలుగు గ్రహాలు రాశి మార్పు చెందుతున్నాయి. శుక్ర, బుధ, రవి, కుజుల రాశి మార్పు వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు ఆదాయపరంగా, అధికారపరంగా బాగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇందులో శుక్ర, బుధుల కదలికల వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉండగా, రవి, కుజుల రాశి మార్పు వల్ల కెరీర్ పరంగా అందలాలు ఎక్కే అవకాశం ఉంది. మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, వృశ్చిక రాశుల వారికి అనేక శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. జీవితాలు అనేక రకాలుగా సానుకూల మలుపులు తిరుగుతాయి.

  1. మేషం: ఈ నాలుగు గ్రహాల రాశి మార్పు ఈ రాశివారికి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రాశి నాథుడు కుజుడు మిథునంలోకి మారడం వల్ల కెరీర్ పరంగా వీరు అనేక విధాలుగా లబ్ధి పొందడం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. ఏ ఆదాయ ప్రయత్నం చేపట్టినా ఆర్థిక లాభాలు అత్యధికంగా ఉంటాయి. దాంపత్య జీవితం కూడా సుఖ సంతోషాలతో సాగిపో తుంది. ఏ పని తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఎక్కువ సంఖ్యలో శుభవార్తలు వింటారు.
  2. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడితో సహా నాలుగు గ్రహాలు బాగా అనుకూల రాశుల్లోకి వస్తు న్నందువల్ల రాజపూజ్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి దాదాపు పూర్తిగా బయటపడి లాభాల బాట పడతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పెద్దగా కష్టపడకుండానే ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కూడా బయటపడతారు.
  3. మిథునం: రాశ్యధిపతి బుధుడు సింహ రాశిలో సంచారం చేయడం, ఈ గ్రహంతో రవి, శుక్రులు కూడా కల వడం వల్ల ఉద్యోగపరంగా ఇది బాగా అనుకూల సమయంగా మారుతుంది. కొత్తగా ఉద్యోగం సంపాదించడానికి, ఉద్యోగం మారడానికి బాగా అవకాశం ఉంది. వ్యాపారాల్లో ధన యోగాలు పడ తాయి. వృత్తి జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. మంచి పెళ్లి సంబంధం కుదు రుతుంది. ఆర్థికంగా బాగా లాభపడే అవకాశం ఉంది. అనేక మంచి అవకాశాలు అందివస్తాయి.
  4. సింహం: ఈ రాశిలో బుధ, శుక్ర గ్రహాలతో పాటు రాశ్యధిపతి రవి కూడా చేరడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. ప్రతి పని, ప్రతి ప్రయత్నం తప్పకుండా లాభదాయకంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై, విలు వైన ఆస్తి కలిసి వస్తుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా బలపడుతుంది. అనేక శుభవార్తలు వింటారు.
  5. తుల: రాశ్యధిపతి శుక్రుడు లాభస్థానంలో ప్రవేశించడం, అక్కడ రవి, బుధులతో యుతి చెందడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కూడా మూడు పువ్వులు, ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్థిర త్వం లభిస్తాయి. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందు తాయి. వైవాహిక జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సంతాన యోగానికి బాగా అవకాశముంది.
  6. వృశ్చికం: ముఖ్యమైన గ్రహాల రాశి మార్పుతో ఈ రాశికి ఉద్యోగ స్థానం బాగా బలపడుతున్నందువల్ల కెరీర్ పరంగా కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు విదేశీ కంపెనీలతో సహా అనేక కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగం మార డానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.