Horoscope Today: ఈ రాశివారికి అనుకోని అదృష్ట యోగం.. అందులో మీ రాశి ఉందా.?

| Edited By: Ravi Kiran

Jan 16, 2023 | 1:14 PM

ఊహించని విధంగా ఒక మంచి అదృష్ట యోగం పట్టబోతోంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఆశించిన స్థాయిలో ప్రయోజనం పొందుతారు.

Horoscope Today: ఈ రాశివారికి అనుకోని అదృష్ట యోగం.. అందులో మీ రాశి ఉందా.?
Horoscope
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి ఇది మంచి సమయం. ఉద్యోగంలో అధికారులు మీ మాటకు విలువనిస్తారు. ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక పరిస్థితి మీరు ఆశించిన స్థాయిలోనే ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అన్ని పనులు సవ్యంగా జరిగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఊహించని విధంగా ఒక మంచి అదృష్ట యోగం పట్టబోతోంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఆశించిన స్థాయిలో ప్రయోజనం పొందుతారు. ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు. పిల్లలు మంచి పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందుకుంటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అధికారులతో వ్యవహరించేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వాహనాలను వేగంగా నడపటం శ్రేయస్కరం కాదు. కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. మనసులోని విషయాలను బయట పెట్టకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రులకు సహాయం చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. మీ వల్ల అధికారులు ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. కుటుంబ పరంగా ఒకటి రెండు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. ముఖ్యంగా వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొందరు స్నేహితులను నమ్మి డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వల్ల సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. పెళ్లి సంబంధం ఒకటి వాయిదా పడుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన రుణ సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబ పరంగా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మంచి చోట పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. ఊహించని విధంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వాతావరణం బాగుంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి తగిన వాతావరణం ఏర్పడుతుంది. ఐటీ వంటి వృత్తి నిపుణులు బాగా రాణిస్తారు. ఉద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులకు కొద్దిగా సహాయం చేస్తారు. పెళ్లి సంబంధం ఒకటి వాయిదా పడుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. వ్యసనాల జోలికి పోవద్దు. వాగ్దానాలు చేయడానికి, హామీలు ఉండటానికి ఇది సమయం కాదు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉండక పోవచ్చు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

జీవితానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఉద్యోగ పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. అధికార యోగానికి అవకాశం ఉంది. అధికారులు కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో మీ మీద ఆధారపడతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ)

ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలోనే కాక కుటుంబ పరంగా కూడా ఎంతో శ్రమ, ఒత్తిడి అనుభవానికి వస్తాయి. అధికారులతో ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కొందరు స్నేహితులు పక్కదారి పట్టించే అవకాశం ఉంది. మీ స్తోమతకు మించి బంధువులకు ఆర్థికంగా సహాయపడతారు. పెళ్లి ప్రయత్నంలో చికాకులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం దొరుకుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగానికి సంబంధించి లేదా ఆదాయానికి సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కుటుంబ సమస్య ఒకటి సామరస్యంగా పరిష్కారం అవుతుంది. అన్నదమ్ములతో ఆస్తి వివాదం కూడా ఒక కొలిక్కి వస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.