పంచాయతీరాజ్‌ శాఖపై నిమ్మగడ్డ మరోసారి సీరియస్‌.. ఆ విషయంపై స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశం

ఆంధ్రపద్రేశ్‌ పంచాయతీరాజ్ శాఖపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ మరోసారి సీరియస్‌ అయ్యారు. తమ ఆదేశాలను

పంచాయతీరాజ్‌ శాఖపై నిమ్మగడ్డ మరోసారి సీరియస్‌.. ఆ విషయంపై స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశం
Follow us

|

Updated on: Feb 01, 2021 | 11:10 AM

ఆంధ్రపద్రేశ్‌ పంచాయతీరాజ్ శాఖపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ మరోసారి సీరియస్‌ అయ్యారు. తమ ఆదేశాలను సక్రమంగా అమలు చేయడం లేదని ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. అదే శాఖపై తాజాగా మరోసారి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థులను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకున్నారని, నామినేషన్ల పత్రాలను చించేశారని పలు పార్టీలు ఆరోపించాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఆన్ లైన్ ద్వారా కూడా నామినేషన్లు వేసే వెసులుబాటు కల్పించాలని పార్టీలు ఎస్‌ఈసీని కోరాయి.

ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ పత్రాలను ఆన్ లైన్ ద్వారా ఎందుకు స్వీకరించడంలేదని పంచాయతీరాజ్ శాఖ అధికారులను నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రశ్నించారు. అంతేకాదు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్ లు స్వయంగా తన కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.