ఇదెక్కడి ట్విస్ట్ రా మావా..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పిల్లజమీందార్ హీరోయిన్

వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు నాని.. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు నాని. అలాగే నాని కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో పిల్ల జమిందార్ మూవీ ఒకటి. జి. అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇదెక్కడి ట్విస్ట్ రా మావా..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పిల్లజమీందార్ హీరోయిన్
Nani
Follow us

|

Updated on: Apr 28, 2024 | 12:14 PM

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో తిరుగు లేని హీరోగా నటిస్తున్నాడు. విభిన్నమైన సినిమాలు చేస్తూ తన గ్రాఫ్ ను పెంచుకుంటూ పోతున్నాడు. వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు నాని.. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు నాని. అలాగే నాని కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో పిల్ల జమిందార్ మూవీ ఒకటి. జి. అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నాని తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. 2011 లో వచ్చిన ఈ సినిమా సూపర్ హాట్ గా నిలిచింది. ఈ సినిమా కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో నానికి జోడీగా బిందుమాధవి, హరిప్రియ నటించారు. అయితే ఈ సినిమాలో హరిప్రియ సింధు అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తకిట తకిట పిల్లజమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, గలాట , ఈ వర్షం సాక్షిగా, జైసింహా సినిమాల్లో నటించింది హరిప్రియ.

హరిప్రియ హీరోయిన్ మాత్రమే కాదు ఆమె ఓ ఫెమస్ భరతనాట్య కళాకారిణి. ఎన్నో అద్భుత ప్రదర్శనలు కూడా ఇచ్చింది ఈ చిన్నది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. జై సింహ సినిమా తర్వాత ఈ చిన్నది సినిమాలు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది హరిప్రియ. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హరిప్రియ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

హరిప్రియ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.