తిరుపతిలో గతం కంటే ఎక్కువ మెజార్టీ, పోలవరంపై వాస్తవాలేంటో అసెంబ్లీలోనే చెబుతాం : మంత్రి బొత్స సత్యనారాయణ

త్వరలో జరుగబోతోన్న తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో గతంలో కంటే మెజార్టీ ఎక్కువే వస్తుందంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ…

  • Venkata Narayana
  • Publish Date - 9:31 pm, Sat, 28 November 20

త్వరలో జరుగబోతోన్న తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో గతంలో కంటే మెజార్టీ ఎక్కువే వస్తుందంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ. పోలవరంపై వాస్తవాలేంటో అసెంబ్లీలోనే చెబుతామన్నారు. వరదలు వచ్చినప్పుడు సీఎం ఏరియల్‌ సర్వే చేయకుండా… నీళ్లలో పాకుకుంటూ వెళ్తారా… గతంలో చంద్రబాబు కూడా ఇదే చేశారా అని బొత్స ప్రశ్నించారు. తుఫాన్ నష్టపరిహారం అంచనా వేయడానికి అధికారులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం టీటీకో ఇళ్ల చర్చ రావాలని మేము కోరుకొంటున్నామని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు.