‘రివర్స్ టెండరింగ్‌’.. ప్రభుత్వం నిజంగా సక్సెస్ అయిందా?

దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని నిర్ణయం ఏపీ గవర్నమెంట్ తీసుకుంది. ‘రివ‌ర్స్ టెండ‌రింగ్ విష‌యంలో ముందు నుంచి క్లారిటీతో ఉన్న సీఎం జగన్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేశారు. అందుకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోల‌వ‌రం ప్రాజెక్ట్ నుంచే నాంది పలికారు. ఈ విధానం ద్వారా ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీ ప్ర‌యోజ‌నం చేకూరుతుందని ప్ర‌భుత్వం చెబుతోంది. ప్రతిపక్ష టీడీపీ  మాత్రం ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. పైగా రివర్స్ టెండ‌రింగ్ విధానం సహేతుకమైనది […]

'రివర్స్ టెండరింగ్‌'.. ప్రభుత్వం నిజంగా సక్సెస్ అయిందా?
Follow us

|

Updated on: Sep 24, 2019 | 9:13 PM

దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని నిర్ణయం ఏపీ గవర్నమెంట్ తీసుకుంది. ‘రివ‌ర్స్ టెండ‌రింగ్ విష‌యంలో ముందు నుంచి క్లారిటీతో ఉన్న సీఎం జగన్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేశారు. అందుకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోల‌వ‌రం ప్రాజెక్ట్ నుంచే నాంది పలికారు. ఈ విధానం ద్వారా ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీ ప్ర‌యోజ‌నం చేకూరుతుందని ప్ర‌భుత్వం చెబుతోంది. ప్రతిపక్ష టీడీపీ  మాత్రం ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. పైగా రివర్స్ టెండ‌రింగ్ విధానం సహేతుకమైనది కాదరి చెప్తోంది. రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానాన్ని ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేప‌ట్ట‌లేదు. కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డిచే కొన్ని సంస్థ‌ల్లో మాత్ర‌మే ఈ ప్ర‌క్రియ చేప‌ట్టారు. అయితే, జగన్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల్లో భాగంగా ఈ విధానం ఏపీలో అమ‌లులోకి వ‌చ్చింది.

సీఎ జగన్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పోల‌వ‌రం స‌హా అనేక కీల‌క ప్రాజెక్టుల ప‌నుల‌న్నీ నిలిపివేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని, వాటిపై విచార‌ణ చేసిన త‌ర్వాత మాత్ర‌మే ప‌నులు తిరిగి ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అందుకు అనుగుణంగానే పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల ప‌రిశీల‌న‌కు ఓ నిపుణుల క‌మిటీని నియ‌మించారు. ఆ క‌మిటీ నివేదిక ప్ర‌కారం ప్రభుత్వ ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో రూ. 2,500 కోట్ల అవినీతి జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దానిని స‌రిచేయ‌డం కోసం రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్రారంభిస్తున్న‌ట్టు తెలిపింది.

పోలవరం ప్రాజెక్టు హెడ్ వ‌ర్క్స్ నుంచి ఎడ‌మ కాలువ‌కు అనుసంధానం చేసే 65వ ప్యాకేజీ ప‌నుల‌కు రివ‌ర్స్ టెండ‌రింగ్ ప‌ద్ధ‌తి నిర్వ‌హించారు. దాని ద్వారా రూ. 58 కోట్ల రూపాయాలు ఆదా చేసిన‌ట్టు ప్ర‌భుత్వం చెబుతోంది. ఆరు సంస్థ‌లు టెండ‌ర్లు దాఖ‌లు చేయ‌గా, అందులో ఎల్ 1 సంస్థ రూ.260.26 కోట్ల‌కు టెండ‌ర్ దాఖ‌లు చేసింది. రూ.274 కోట్ల విలువ చేసే ప‌నుల‌ను 6.1 శాతం త‌క్కువ‌కు పూర్తి చేయ‌డానికి అంగీక‌రించిన ఎల్ 1 క‌న్నా ఎవ‌రైనా త‌క్కువ‌కు చేస్తారా అంటూ రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్వ‌హించారు. దాంతో రూ.231.47 కోట్ల‌తో పూర్తి చేసేందుకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. ఇది అంచ‌నా విలువ క‌న్నా 15.66 శాతం త‌క్కువ. గ‌తంలో నిర్వ‌హించిన టెండ‌ర్‌తో పోలిస్తే ఈసారి రూ.58.53 కోట్ల ప్ర‌జాధ‌నం ఆదా చేసిన‌ట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

తాజాగా కీల‌క‌మైన హెడ్ వ‌ర్క్స్, ప‌వ‌ర్ స్టేష‌న్ ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచారు. రూ. 4,987.55 కోట్ల విలువచేసే ప‌నుల‌కు టెండర్లు పిలువగా.. 12.6 శాతం తక్కువ మొత్తానికే ఈ పనులు చేపట్టేందుకు ‘మేఘా’ సంస్థ ముందుకొచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పనుల కోసం రూ. 4,358.11 కోట్లు కోట్‌ చేస్తూ.. మేఘా సంస్థ బిడ్డింగ్‌ వేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 628.43 కోట్లు ఆదా అవుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు, గతంలో 4.8 శాతం అధిక ధరకు కాంట్రాక్టు ఇవ్వ‌డం వ‌ల్ల‌ ప్రభుత్వానికి రూ. 154 కోట్ల అదనపు భారం పడిందని, ఇప్పుడు ఆ భారం కూడా తగ్గడంతో ప్ర‌భుత్వానికి మొత్తం రూ. 782 కోట్లు ఆదా అయినట్టు అధికారులు చెప్పారు. అధికారుల లెక్కల ప్రకారం చూస్తే మాత్రం ఈ ప్రభుత్వం ఖజానాకు భారీగానే ఆదాను చేకూర్చబోతున్నట్లు కనిపిస్తుంది.

కాగా టీడీపీ మాత్రం రివర్స్ టెండరింగ్ సక్సెస్ అంటే ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం రివ‌ర్స్ టెండ‌రింగ్ పేరుతో త‌మ‌కు కావాల్సిన వారికి ప‌నులు అప్ప‌గించేందుకు ‘రిజ‌ర్వ్‌డ్ టెండ‌రింగ్’ అమ‌లు చేసింద‌ని టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆరోపిస్తున్నారు.