‘ప్రత్యేక హోదా’పై అసెంబ్లీలో గళమెత్తిన వైఎస్ జగన్

ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలి అనే తీర్మానాన్ని తాము కేంద్రానికి పంపుతున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై ఆయన ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని తెలిపారు. ‘‘విభజనతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది. విభజన నష్టాలను హోదాతోనే పూడ్చగలం. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను తీర్చలేదు. ఐదేళ్లలో రూ.2.58లక్షల కోట్ల అప్పులు పెరిగాయి. ఉపాధి కల్పన సామర్థ్యం […]

‘ప్రత్యేక హోదా’పై అసెంబ్లీలో గళమెత్తిన వైఎస్ జగన్
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2019 | 2:50 PM

ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలి అనే తీర్మానాన్ని తాము కేంద్రానికి పంపుతున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై ఆయన ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని తెలిపారు. ‘‘విభజనతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది. విభజన నష్టాలను హోదాతోనే పూడ్చగలం. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను తీర్చలేదు. ఐదేళ్లలో రూ.2.58లక్షల కోట్ల అప్పులు పెరిగాయి. ఉపాధి కల్పన సామర్థ్యం గణనీయంగా పడిపోయింది’’ అని అన్నారు.

ప్రత్యేక హోదా వస్తేనే అత్యధికంగా గ్రాంట్లు లభిస్తాయి. ఐటీ, జీఎస్టీ సహా ఇతర మినహాయింపులు లభిస్తాయి. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు, ఐటీ, విద్యా సంస్థలు వస్తాయని.. ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జగన్ పేర్కొన్నారు. హోదాపై 2014 మార్చి 2న కేంద్రమంత్రి మండలి తీర్మానం చేసిందని.. ఆ రోజే ప్రణాళిక సంఘానికి కేబినెట్ ఆదేశించిందని జగన్ చెప్పుకొచ్చారు. కానీ 2014 జనవరి నుంచే నీతి అయోగ్ అమల్లోకి వచ్చిందని..హోదా ఇవ్వకపోవడానికి అనేక వదంతులు, సాకులు ఉన్నాయని ఆయన అన్నారు.