తక్కువ రేట్లకే కరోనా ర్యాపిడ్ కిట్లు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

కరోనా వైరస్ ర్యాపిడ్ కిట్ల ధరలపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్తగా కొనుగోలు చేసిన కరోనా టెస్ట్ కిట్ల ధరల మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఒక్కొక్కటి రూ.337 చొప్పున కొనుగోలు చేయగా..

తక్కువ రేట్లకే కరోనా ర్యాపిడ్ కిట్లు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 3:46 PM

కరోనా వైరస్ ర్యాపిడ్ కిట్ల ధరలపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్తగా కొనుగోలు చేసిన కరోనా టెస్ట్ కిట్ల ధరల మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఒక్కొక్కటి రూ.337 చొప్పున కొనుగోలు చేయగా.. ఏపీ ప్రభుత్వం ఒక్కో కిట్‌కు రూ.730లు పెట్టి చెల్లించిందనే వార్తలు వచ్చాయి. ఇలా 2 లక్షల కరోనా టెస్ట్ కిట్లను కొనుగోలు చేయగా.. అందులో లక్ష కిట్లను మాత్రమే డెలివరీ అయ్యాయి. ఈ మొత్తానికి గానూ రూ.14.60 కోట్లు ఖర్చు అయ్యింది. ఓ రకంగా చూస్తే ఛత్తీస్‌గఢ్ చెల్లించిన ధర కంటే ఏపీ ప్రభుత్వం డబుల్ రేటు చెల్లించింది ఏపీ గవర్నమెంట్.

అయితే మొత్తం 8 లక్షల కిట్లను ఏపీ ప్రభుత్వం ఆర్డర్ చేసినట్లు సమాచారం. అందులో 25 శాతం ధర రూ.14.60 కోట్ల ధరను ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన డబ్బులు కిట్లు మొత్తం విజయవాడకు డెలివరీ అయిన తర్వాత చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ ఇప్పుడు ఈ ధరలపై ప్రభుత్వం ఆరోపణలు తలెత్తుతున్నాయి. అయితే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.337కి కొంటే.. ఏపీ ప్రభుత్వం రూ.730కి కొనడమేంటని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కరోనా ర్యాపిడ్ కిట్లను ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ ఏ రేటుకు కొన్నదో.. అదే రేటే తాము కూడా చెల్లిస్తామని సీఎం జగన్ స్ఫష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

Read More: 

కరోనా టెస్ట్ రిపోర్ట్స్ తారుమారు

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..

ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌.. టీఎస్ బోర్డు కీలక నిర్ణయం

ఫేస్‌బుక్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు.. ‘రక్త చరిత్ర’ నటుడు అరెస్ట్