నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 6500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.!

ఏపీలోని నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. తాజాగా విజయవాడలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి పోలీస్ శాఖలోని..

  • Ravi Kiran
  • Publish Date - 2:21 pm, Wed, 21 October 20

Police Recruitment 2020: ఏపీలోని నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. తాజాగా విజయవాడలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి పోలీస్ శాఖలోని ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 6500 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను డిసెంబర్‌లో జారీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు.

అలాగే జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ఈ పోస్టులను నాలుగు దశల్లో భర్తీ చేస్తామని సీఎం అన్నారు. అంతేకాదు పోలీస్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను కూడా వెంటనే చెల్లిస్తామని తెలిపారు. పోలీస్ అమరవీరులందరికీ జేజేలు పలికిన సీఎం.. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఎవర్నీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కుల, మత ఘర్షణల్లో పోలీసులు పారదర్శకంగా పని చేయాలన్నారు. కాగా, దిశ బిల్లును కేంద్రం త్వరలోనే ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.