పీవోకేలో పాక్‌,చైనాలకు వ్యతిరేకంగా నిరసనలు

పీవోకేలో నిరసనలు వెల్లువెత్తాయి. నీలం, జీలం నదులపై ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ. ముజఫరాబాద్‌లో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నదులపై ఆనకట్ట వేయడం కోసం..

పీవోకేలో పాక్‌,చైనాలకు వ్యతిరేకంగా నిరసనలు
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2020 | 6:47 AM

పీవోకేలో నిరసనలు వెల్లువెత్తాయి. నీలం, జీలం నదులపై ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ. ముజఫరాబాద్‌లో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నదులపై ఆనకట్ట వేయడం కోసం.. ఏ చట్టం కింద ఒప్పందం కుదుర్చుకున్నారని.. నిరసనకారులు పాక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రెండు నదులపై ఆనకట్టలు కట్టడం అక్రమం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్,చైనా ప్రభుత్వాలు కలిసి ఈ నదులపై హైడ్రో పవర్ ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించేందుకు రెడీ అయ్యాయని.. వెంటనే వీటిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పనులను ఆపేంత వరకు అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు.. ఈ నిర్మాణాలు పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. ప్రాజెక్ట్ పనులు ఆపేంత వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతామని స్థానికులు హెచ్చరించారు.

కాగా, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) కింద‌ పీవోకేలోని జీలం న‌దిపై హైడ్రో ప‌వ‌ర్ ప్లాంట్ ను నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల కుదిర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం.. చైనాకు చెందిన ఓ కంపెనీ 1,124 మెగావాట్ల జ‌లవిద్యుత్ ప్లాంట్ ను 2. బిలియ‌న్ డాలర్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు.