Y.S.Vijayamma: పేలిన కారు టైర్‌..  విజయమ్మకు తప్పిన ప్రమాదం.. 

Y.S.Vijayamma: వై.ఎస్‌ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. గురువారం కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. అనంతపురంలో ఓ కార్యక్రమానికి హాజరైన తర్వాత విజయమ్మ తిరుగు ప్రయాణం...

Y.S.Vijayamma: పేలిన కారు టైర్‌..  విజయమ్మకు తప్పిన ప్రమాదం.. 

Updated on: Aug 11, 2022 | 3:13 PM

Y.S.Vijayamma: వై.ఎస్‌ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. గురువారం కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. అనంతపురంలో ఓ కార్యక్రమానికి హాజరైన తర్వాత విజయమ్మ తిరుగు ప్రయాణం సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆమె ప్రయాణిస్తోన్న కారు రెండు టైర్లు పేలిపోయాయి. అయితే కారు పెద్దగా వేగంలో లేక పోవడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. కారులో విజయమ్మతో పాటు ప్రయాణిస్తున్న మరెవరికీ ప్రమాదమూ జరగలేదు. వెంటనే విజయమ్మను మరో కారులో అక్కడి నుంచి పంపించారు.

విజయమ్మం అనంతపురం జిల్లాలోని అయ్యప్పరెడ్డి పరామర్శించడానికి వెళ్లారు. అనంతరం హైదరాబాద్‌కు కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదే సమయంలో కారు కర్నూల్‌ జిల్లాలోని గుత్తి చేరుకునే సమయంలో కారు రెండు టైర్లు పేలిపోయాయి. డ్రైవర్‌ చాకచక్యంగా కంట్రోల్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us