Anakapalle: తన లవర్‌ను బస్సు నుంచి దింపాలంటూ డ్రైవర్ మెడపై కత్తి.. కట్ చేస్తే..

యూత్ పెడదారి పట్టారు. చదువుకోవాల్సిన వయస్సులో ప్రేమ, దోమ అంటూ ఇతరులను వేధిస్తున్నారు. వారి చెప్పినట్లు వినకపోతే దాడులకు సైతం వెనకాడం లేదు.

Anakapalle: తన లవర్‌ను బస్సు నుంచి దింపాలంటూ డ్రైవర్ మెడపై కత్తి.. కట్ చేస్తే..
Shivasai

Updated on: Feb 24, 2023 | 10:20 AM

వన్‌సైడ్‌ లవ్‌తో ఓ యువకుడు సైకోలా మారాడు. తను ఇష్టపడుతున్న అమ్మాయితో ఎలాగైనా మాట్లాడాలని ఫిక్సై.. కత్తిపట్టి హల్‌చల్‌ చేశాడు. ప్రైవేట్ కాలేజ్ బస్‌కు తన స్కూటీని అడ్డంగా పెట్టి, కత్తితో డ్రైవర్‌ను మిగతా వాళ్లను బెదిరిస్తూ హడలెత్తించాడు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం దగ్గర్లో జరిగిందీ ఘటన. బస్సు బయ్యవరం తేగాడ రూట్‌లో మధ్యలో ఉన్నప్పుడు కత్తితో వచ్చి సడన్‌గా బస్‌ ఆపాడు గడసాల శివసాయి. ఓ దశలో డ్రైవర్ మెడపై కత్తి పెట్టి మరీ బెదిరించాడు. ఇది చూసిన కాలేజీ అమ్మాయిలంతా హడలిపోయారు.

తను ఇష్టపడుతున్న అమ్మాయి ఇదే బస్‌లో వెళ్తుందని తెలిసి నిన్ననే బస్‌ ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్‌ ఆపకపోవడంతో పగబట్టాడు. ఇవాళ టూవీలర్‌పై వెంటపడి వచ్చి బస్‌ ఆపాడు. తర్వాత కత్తితో బెదిరించాడు. ఐతే.. బస్సులో అతను అనుకున్న అమ్మాయి లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. చివరికి డ్రైవర్‌ ఫిర్యాదుతో శివసాయిని అరెస్టు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us