Suicide: విజయవాడలో దారుణం.. భర్త వేధింపులు తాళలేక మహిళ హోంగార్డ్ ఆత్మహత్య..

Suicide: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. మహిళా హోమ్ గార్డు సూసైడ్.. నగరంలో పెను కలకలం..

Suicide: విజయవాడలో దారుణం.. భర్త వేధింపులు తాళలేక మహిళ హోంగార్డ్ ఆత్మహత్య..
Home Guard Suicide

Updated on: Jul 21, 2021 | 9:15 AM

Suicide: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. మహిళా హోమ్ గార్డు సూసైడ్.. నగరంలో పెను కలకలం సృష్టించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని మహిళా హోమ్ గార్డు అనిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అనిత హోమ్ గార్డుగా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు శివ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, గత కొంతకాలంగా అనితను శివ వేధింపులకు గురి చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

భర్త శివ వేధింపులు తాళలేక అనిత పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. భర్త వేధింపుల కారణంగానే అనిత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read:

Trivikram Srinivas : నందమూరి నటసింహంతో మాటల మాంత్రికుడు సినిమా చేయనున్నారా..?

Mangli Bonalu Song: సింగర్ మంగ్లీపై పోలీసులకు ఫిర్యాదు.. అభిమానుల రచ్చతో ఏం చేసిందంటే..?

థియేటర్లోనే ‘ఇష్క్’.. విడుదల ఎప్పుడంటే..? ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్!