Woman Suicide Attempt: కరోనా వెంటాడుతోంది.. భయం ప్రాణాలు తీస్తోంది.. కేజీహెచ్‌లో కోవిడ్‌ పేషెంట్‌ ఆత్మహత్యాయత్నం!

కరోనా బాధితురాలు విశాఖ కేజీహెచ్ మేడ పైనుంచి దూకబోయింది. తక్షణమే గమనించిన సిబ్బంది ఆమెను కాపాడారు.

Woman Suicide Attempt: కరోనా వెంటాడుతోంది.. భయం ప్రాణాలు తీస్తోంది.. కేజీహెచ్‌లో కోవిడ్‌ పేషెంట్‌ ఆత్మహత్యాయత్నం!
Visakhapatnam Woman Tries To Kill Self At King George Hospital
Follow us

|

Updated on: Jun 05, 2021 | 4:13 PM

Woman tries to kill self at KGH: కరోనా బాధితురాలు విశాఖ కేజీహెచ్ మేడ పైనుంచి దూకబోయింది. తక్షణమే గమనించిన సిబ్బంది ఆమెను కాపాడారు. తనను ఇంటికి పంపించాలని బాధితురాలు వైద్యులను కోరగా.. ఆమె కోలుకోకపోవటంతో వైద్యులు సర్దిచెప్పారు. విశాఖపట్నం కేజీహెచ్​లో సీఎస్​ఆర్ బ్లాక్ పైనుంచి దూకబోయిన కోవిడ్ బాధితురాలిని..వైద్య సిబ్బంది రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించటాన్ని గమనించిన సిబ్బంది.. తక్షణమే స్పందించి సదరు మహిళను కాపాడారు. కొద్దిరోజులుగా ఆమె కుటుంబానికి దూరంగా ఉండటంతో.. ఇంటికి తరలించాలని వైద్యులను కోరింది. ఆమె కోలుకోకపోవటంతో వైద్యులు సర్ది చెప్పారు. ఇదే క్రమంలో ఆమె చికిత్స పొందుతున్న గది కిటికీ వద్దకు వెళ్లి దూకేందుకు సిద్ధపడింది. సమీపంలో ఉన్న మరో కోవిడ్ బాధితుడు గమనించి కేకలు వేయడంతో అప్రమత్తమైన సిబ్బంది.. ఆమెను అడ్డుకున్నారు.

ఇదిలావుంటే, కేజీహెచ్ ఆసుపత్రిలోని ఈ బ్లాక్‌లో ఇప్పటికే మేడ పైనుంచి దూకి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది వెల్లడి చేయలేదు. సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో విషయం తెలిసింది. దీంతో ఆసుపత్రి ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

Read Also… COVID-19 infection: కరోనా సోకి కోలుకుంటే, 10 నెలల వరకు ముప్పు చాలా తక్కువ.. బ్రిటన్ సైంటిస్టుల అధ్యయనంలో ఆసక్తికర అంశాలు..!

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..